
Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం-పాక్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ కుట్రలపై భారత్ వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తోంది.
పాక్ చేస్తున్న విధ్వంసక చర్యలను ధీటుగా తిప్పికొడుతూ, దేశ భద్రతను కాపాడేందుకు మాస్టర్ ప్లాన్లలను అమలు చేస్తోంది.
ఈ దెబ్బలకు తాళలేక పాకిస్థాన్ గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్లింది. అయితే ప్రత్యక్షంగా ఎదుర్కోవడం కష్టం కావడంతో ఇప్పుడు పాక్ కొత్తగా సైబర్ యుద్ధానికి దిగినట్లు సమాచారం.
భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సైబర్ దాడులకు పాక్ యత్నిస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి భారత నిఘా సంస్థలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.
Details
అనుమానాస్పద లింక్ లు క్లిక్ చేయొద్దు
అనుమానాస్పద ఫైల్‌లు, లింక్‌లు, అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయవద్దని సూచించాయి. మాల్వేర్ అటాకుల ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం.
ప్రజల సమాచారం, బ్యాంకింగ్ డేటా వంటి సున్నితమైన విషయాలను హ్యాక్ చేయడానికి పాక్ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ సైబర్ యుద్ధానికి ఉపయోగిస్తున్న మాల్వేర్‌లో 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' అనే వైరస్ ప్రాధాన్యత పొందుతోంది.
ఇది వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్ రూపంలో పంపారు. ఒకసారి ఇది యాక్టివేట్ అయితే, మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశముందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Details
దిక్కుతోచని స్థితిలో పాక్
అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఇమెయిళ్లు లేదా లింక్‌లను క్లిక్ చేయొద్దని కోరుతున్నారు. ఇక మరోవైపు, పాక్ సైనిక చర్యలకు భారత్ ఘాటుగా బదులిస్తోంది.
భారత సాయుధ దళాలు పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై వరుస దాడులు నిర్వహించి వాటిని విజయవంతంగా ధ్వంసం చేశాయి.
డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుని, పాక్ రక్షణ వ్యవస్థను గణనీయంగా దెబ్బతీశాయి. ఈ ప్రభావంతో పాకిస్తాన్‌లో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
సమాచారం ప్రకారం, కొన్ని ముఖ్య నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.