ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ
చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా AI రంగంలోకి ప్రవేశించబోతుంది. ChatGPT లాంటి టూల్‌ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. చైనీస్ వార్తాపత్రిక 21వ సెంచరీ హెరాల్డ్ ప్రస్తుతం ఇంకా అభివృద్ది దశలో ఉందని సమాచారాన్ని అందించిన తరవాత ఈ ప్రకటన వచ్చింది. మరో చైనీస్ టెక్ దిగ్గజం బైడు కూడా ఇలాంటి టూల్ పై పని చేస్తోంది. ChatGPT విజయం ఇతర టెక్ దిగ్గజాలకు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపించింది. ప్రతి సంస్థ ఈ రంగంపై దృష్టి సారించేలా చేసింది. అలీబాబా చాట్‌బాట్ గురించి వివరాలను ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఈ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటుంది. అభివృద్ది చేసిన చాట్‌బాట్‌ను తన కమ్యూనికేషన్ యాప్ డింగ్‌టాక్‌తో కలపాలని ఆలోచిస్తుందని చైనీస్ వార్తాపత్రిక తెలిపింది.
ChatGPT లాంటి సాధనాన్ని అభివృద్ధి చేస్తున్న మరో చైనీస్ టెక్ దిగ్గజం బైడు
2017లో DAMO ఏర్పడినప్పటి నుండి పెద్ద భాషా నమూనాలు, AI వంటి ఆవిష్కరణలపై మా దృష్టి ఉందని అలీబాబా ప్రతినిధి తెలిపారు. DAMO అంటే డిస్కవరీ, అడ్వెంచర్, మొమెంటుమ్, అవుట్ లుక్. టెక్నాలజీ లీడర్‌గా, కస్టమర్‌లతో పాటు వినియోగదారుల కోసం అత్యాధునిక ఆవిష్కరణలను రూపొందించడం కొనసాగిస్తామని ఆయన అన్నారు. ChatGPT లాంటి సాధనాన్ని అభివృద్ధి చేస్తున్న మరో చైనీస్ టెక్ దిగ్గజం బైడు, 'వెన్క్సిన్ యియాన్' (చైనీస్‌లో) లేదా ERNIE (నాలెడ్జ్ ఇంటిగ్రేషన్ ద్వారా మెరుగైన ప్రాతినిధ్యం) పేరుతో బైడు తన బాట్ ను మార్చిలో ప్రారంభిస్తుంది.