Page Loader
Google Android: స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూకంప హెచ్చరికలు.. గ్లోబల్‌గా విస్తరిస్తున్న గూగుల్ వ్యవస్థ

Google Android: స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూకంప హెచ్చరికలు.. గ్లోబల్‌గా విస్తరిస్తున్న గూగుల్ వ్యవస్థ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2024
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్‌లోని 50 రాష్ట్రాలపైనే కాకుండా ఆరు భూభాగాలకు కూడా విస్తరించింది. 2020లో మొదటిసారిగా పరిచయం చేసిన ఈ సాంకేతికత, స్మార్ట్‌ ఫోన్‌లను సీస్మోమీటర్‌లుగా మార్చి భూకంపాలు సంభవించే ముందు వినియోగదారులకు హెచ్చరికలను పంపనుంది. ప్రత్యేక భూకంప గుర్తింపు వ్యవస్థలు లేని ప్రాంతాల్లో భూకంప హెచ్చరికలను అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ స్మార్ట్‌ఫోన్‌లోని యాక్సిలరోమీటర్ సెన్సార్‌ను ఉపయోగించి భూకంపం మొదటి తరంగాలను (P-వేవ్‌లను) గుర్తిస్తుంది.

Details

భూకంప తీవ్రత 4.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు గూగుల్ హెచ్చరికలు

ఈ తరంగాలు భూకంప సమయంలో సంభవించే విధ్వంసక S-తరంగాల కంటే ముందు వస్తాయి. స్మార్ట్‌ఫోన్ సెన్సార్‌లు ఈ తరంగాలను గుర్తించినప్పుడు, అవి స్థాన డేటాను గూగుల్ భూకంప గుర్తింపు సర్వర్‌కు పంపిస్తాయి. భూకంప తీవ్రత 4.5 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు, గూగుల్ హెచ్చరికలను జారీ చేస్తుంది. వినియోగదారులు తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రోత్సహిస్తుంది. ఈ వ్యవస్థ ఇప్పటికే 97 దేశాల్లో పనిచేస్తోంది. అమెరికన్ సమోవా, నార్తర్న్ మరియానా దీవులు, ప్యూర్టో రికో, గ్వామ్, యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్, మైనర్ అవుట్‌లైయింగ్ ఐలాండ్స్‌లో కూడా ఈ వ్యవస్థను ప్రారంభించేందుకు గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.