LOADING...
AWS outage: రేర్‌ సాఫ్ట్‌వేర్ బగ్‌తో AWS సేవల్లో అంతరాయం.. వివరాలు వెల్లడించిన అమెజాన్
రేర్‌ సాఫ్ట్‌వేర్ బగ్‌తో AWS సేవల్లో అంతరాయం.. వివరాలు వెల్లడించిన అమెజాన్

AWS outage: రేర్‌ సాఫ్ట్‌వేర్ బగ్‌తో AWS సేవల్లో అంతరాయం.. వివరాలు వెల్లడించిన అమెజాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
07:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS)లో జరిగిన సాంకేతిక అంతరాయం పై కంపెనీ గురువారం విడుదల చేసిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్య ఎలాంటి హార్డ్‌వేర్ లోపం వల్ల గానీ,లేదా బయట నుంచి జరిగిన సైబర్ దాడి వల్ల గానీ కాదని, కానీ చాలా అరుదైన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఏర్పడిన సంక్లిష్టమైన శ్రేణి వైఫల్యం అని కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీ ప్రకారం,వారి అంతర్గత సిస్టమ్‌లలోని "తప్పు ఆటోమేషన్" వల్ల రెండు స్వతంత్ర ప్రోగ్రామ్‌లు ఒకేసారి రికార్డులను అప్‌డేట్‌ చేయడానికి పోటీ పడటం ప్రారంభించాయి. ఆ ప్రక్రియలో DynamoDB డేటాబేస్ సేవకు సంబంధించిన ముఖ్యమైన నెట్‌వర్క్ ఎంట్రీలు తొలగిపోయాయి, దీంతో అనేక ఇతర AWS సేవలు తాత్కాలికంగా దెబ్బతిన్నాయి.

వివరాలు 

వెబ్‌సైట్లు,ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి

AWS తెలిపిన ప్రకారం,ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆ లోపభూయిష్టమైన ఆటోమేషన్‌ను నిలిపివేసి, దానిలోని బగ్‌ను పూర్తిగా సరిదిద్దే వరకు తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. అదనంగా,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త భద్రతా తనిఖీలు,తక్షణ పునరుద్ధరణ విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు వెబ్‌సైట్లు,ఆన్‌లైన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అమెజాన్ క్షమాపణలు తెలిపింది.

వివరాలు 

ఈ ఘటన నుండి పాఠాలు నేర్చుకుంటాం

"మా సేవలను ఎప్పుడూ అత్యుత్తమ స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నాం. మా కస్టమర్లకు, వారి యాప్‌లకు, వ్యాపారాలకు మా సేవలు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. ఈ ఘటన నుండి పాఠాలు నేర్చుకుంటాం" అని తెలిపింది. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ అవుటేజ్‌ మళ్లీ ఒకసారి ఇంటర్నెట్‌ ప్రపంచం ఎంతగా ఆమజాన్‌ క్లౌడ్‌పై ఆధారపడుతుందో స్పష్టంగా చూపించింది. ఒక AWS వైఫల్యం ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సిస్టమ్‌లను ఎలా ప్రభావితం చేయగలదో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.