Amazon Echo Show: భారతదేశంలో అమెజాన్ ఎకో షో 11 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
అమెజాన్ తన కొత్త స్మార్ట్ హోం డివైస్, ఎకో షో 11ని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ డివైస్‌ను గ్లోబల్‌గా మూడ్ నెలల క్రితం పరిచయం చేశారు. ఇది అమెజాన్ ప్రొప్రైటరీ AZ3 Pro చిప్‌సెట్ తో పనిచేస్తుంది.. అలాగే 10.95-ఇంచ్ ఫుల్ HD టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. కొత్త మోడల్‌లో ప్రీమియం 3D నిట్ ఫ్యాబ్రిక్ ఫినిష్, బిల్ట్-ఇన్ ప్రీమియం స్పీకర్స్, హై-రెసల్యూషన్ కెమెరా వంటివి ఉన్నాయి, ఇవి యూజర్ ఇంటరాక్షన్‌ను మరింత మెరుగుపరుస్తాయి. ఇది అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా గ్లేషియర్ వైట్ మరియు గ్రాఫైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
టెక్ స్పెక్స్
ఎకో షో 11 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
ఎకో షో 11 లో 10.95-ఇంచ్ ఫుల్ HD (1920x1200 పిక్సెల్స్) టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. డివైస్ పరిమాణం 72 x 100 x 50mm, బరువు 1.3 కిలోలు. మీడియా వినోదానికి, ఎకో షో 11 ఫ్రంట్-ఫేసింగ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఇవి కొత్త ఎకో స్టూడియో కోసం అభివృద్ధి చేయబడ్డాయి, అలాగే కస్టమ్ వూఫర్ కూడా ఉంది. అమెజాన్ మీడియా కంట్రోల్ సెంటర్‌ని రివాంప్ చేసింది, దీని ద్వారా యూజర్లు మ్యూజిక్, అంబియంట్ సౌండ్స్, పోడ్కాస్ట్స్ను ప్రత్యేక పేజీలలో బ్రౌజ్ చేయవచ్చు.
స్మార్ట్ ఇంటిగ్రేషన్
ఎకో షో 11 స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్, ప్రైవసీ ఫీచర్లు
ఎకో షో 11 Wi-Fi, Zigbee, Matter, Thread ప్రోటోకాల్స్ను సపోర్ట్ చేస్తుంది, ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్‌ను సులభతరం చేస్తుంది. ఇక అమెజాన్ కొత్త సెన్సార్ ప్లాట్‌ఫాం "Omnisense"ను పరిచయం చేసింది, ఇది సెన్సార్లను ఉపయోగించి వ్యక్తిగత రొటీన్‌లను అందిస్తుంది. ఉదాహరణకి, యూజర్ ఒక రొటీన్‌లో ఉష్ణోగ్రతను ట్రిగ్గర్గా సెట్ చేస్తే, అలెక్సా ఆటోమేటిక్‌గా స్మార్ట్ ఫ్యాన్లు ఆన్ చేస్తుంది లేదా స్మార్ట్ బ్లైండ్స్‌ను సర్దుతుంది. డివైస్‌లో మల్టిపుల్ లేయర్స్ ప్రైవసీ కంట్రోల్స్ ఉన్నాయి, అందులో ప్రత్యేక మైక్రోఫోన్ టోగుల్, ఇన్-ఆప్ / డివైస్ కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి.