Amazon Great Republic Day: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ వచ్చేస్తోంది,ఎప్పటి నుండి ప్రారంభం,ఆఫర్లు, డిస్కౌంట్స్… పూర్తి వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ ప్రత్యేక సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు వంటి విభిన్న కేటగిరీలపై భారీ స్థాయిలో తగ్గింపులు అందించనుంది. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ఎప్పటి నుంచి? "గ్రేట్ రిపబ్లిక్ డే సేల్" పేరుతో అమెజాన్ ఈ ప్రత్యేక ఆఫర్లను జనవరి 16 నుంచి ప్రారంభించనుంది. ఈ సేల్ ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జనవరి 26న జరగనున్న భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేల్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే 2026 గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలోనే ప్రారంభమవుతుందని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో డిస్కౌంట్లు ఎలా ఉంటాయి?
SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే కస్టమర్లకు 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌తో పాటు ఈజీ EMI సౌకర్యాలు లభించనున్నాయి. అమెజాన్ మైక్రోసైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సేల్‌లో "8 PM డీల్స్", "ట్రెండింగ్ డీల్స్", "బ్లాక్‌బస్టర్ డీల్స్","ఎక్స్చేంజ్‌తో బ్లాక్‌బస్టర్ డీల్స్","టాప్ 100 డీల్స్" వంటి విభాగాలు ఉండనున్నాయి. అదనంగా,అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు కూడా అందించనున్నారు. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రిపబ్లిక్ డే సేల్‌కు సంబంధించిన మరిన్ని డీల్స్,ఆఫర్ల వివరాలను త్వరలో వెల్లడిస్తామని అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్లు,ల్యాప్‌టాప్‌లు,స్మార్ట్ గ్లాసెస్,వాషింగ్ మెషిన్లు,స్మార్ట్ టీవీలపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సమాచారం.