Amazon Prime Video: టిక్‌టాక్‌కు పోటీగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో షార్ట్ న్యూస్ క్లిప్స్
ఈ వార్తాకథనం ఏంటి
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) కూడా షార్ట్‌ఫామ్ న్యూస్ క్లిప్స్ వైపు అడుగులు వేస్తోంది. టిక్ టాక్‌కు పోటీగా నిలిచేలా తన న్యూస్ కవరేజీని విస్తరిస్తున్నట్లు సంస్థ సోమవారం ప్రకటించింది. ఇందులో స్థానిక,జాతీయ వార్తలకు సంబంధించిన ఎప్పుడైనా చూసే వీలున్న చిన్న వీడియోలు ఉంటాయి. ప్రస్తుతం ఈ క్లిప్స్ టీవీలు,ఇతర లివింగ్ రూమ్ పరికరాల్లో అందుబాటులోకి రానుండగా.. త్వరలో వెబ్‌సైట్,ప్రైమ్ వీడియో మొబైల్ యాప్‌లలోనూ విడుదల చేయనుంది. ప్రైమ్ వీడియో యాప్‌లోని'న్యూస్' విభాగంలో 'ట్రెండింగ్ టాపిక్స్','లోకల్ న్యూస్'విభాగాల ద్వారా ఈ క్లిప్స్ కనిపిస్తాయి. ఇప్పటికే అమెరికాలోని వినియోగదారులకు స్థానిక,జాతీయ,అంతర్జాతీయ వార్తలను అందిస్తున్న పలు ప్రముఖ వార్తా సంస్థల కవరేజీతో పాటు.. ఈ కొత్త షార్ట్‌ఫామ్ న్యూస్ క్లిప్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
యువతను ఆకట్టుకోవాలని భావిస్తున్న అమెజాన్
ఇందుకోసం ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి కాదు. అమెరికాలో ఎవరైనా ఈ వార్తలను చూడవచ్చు.
మొబైల్ యాప్‌లలో ఈ క్లిప్స్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహాలో నిలువు వీడియోలుగా ఉంటాయా లేదా అన్న విషయాన్ని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.
అయితే iOS, ఆండ్రాయిడ్ యాప్‌లలో ఇవి షార్ట్‌ఫామ్ కంటెంట్‌గా అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టిక్‌టాక్ ప్రధానంగా వినోద వేదికగా గుర్తింపు పొందినప్పటికీ.. యువత వార్తలు తెలుసుకునే వేదికగానూ మారుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్ వంటి యాప్‌లలో జెన్ జెడ్ యువత వార్తా కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరిస్తోంది.
అమెజాన్‌కు ప్రత్యేకమైన సోషల్ మీడియా వేదిక లేకపోవడంతో.. ప్రైమ్ వీడియోలోనే షార్ట్‌ఫామ్ వీడియోలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ యువతను ఆకట్టుకోవాలని భావిస్తోంది.
వివరాలు
సమాచారం అందించే విధానం కూడా కీలకమే
అయితే జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకర్షించేది కేవలం వీడియోల నిడివి మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు.
సమాచారం అందించే విధానం కూడా కీలకమే. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనాల ప్రకారం.. యువతకు సహజంగా అనిపించే వార్తా కంటెంట్ నచ్చుతోంది.
ఎక్కువ హంగులు, ఆర్భాటాలు లేని షార్ట్‌ఫామ్ వార్తలను వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
వివరాలు
సమాచారం అందించే విధానం కూడా కీలకమే
షార్ట్‌ఫామ్ క్లిప్స్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి స్ట్రీమింగ్ సంస్థ ప్రైమ్ వీడియో కాదు.
మార్చిలో పీకాక్ ఈ తరహా క్లిప్స్‌కు మద్దతు ఇచ్చింది. జులైలో హెచ్‌బీవో మ్యాక్స్, నెట్‌ఫ్లిక్స్ కూడా ఇదే బాట పట్టాయి.
ఆగస్టులో డిస్నీ+ సైతం షార్ట్‌ఫామ్ వీడియోలను జోడించింది.
ప్రేక్షకులు ఇప్పుడు గంటల తరబడి కాకుండా.. కొన్ని నిమిషాల్లోనే వినోదాన్ని, సమాచారాన్ని పొందేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్ట్రీమింగ్ సంస్థలు ఈ మార్పులకు అనుగుణంగా తమ సేవలను రూపొందిస్తున్నాయి.