Apple iOS 17లో అద్భుతమైన ఫీచర్.. లాంచ్ ఎప్పుడో తెలుసా!
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే వార్త అందింది. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లలో అనేక కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్లకు సంబంధించి కొత్త సాప్ట్‌వేర్ అప్‌డేట్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఆపిల్ iOS 17 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను జూన్ 5న జరగనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ప్రవేశపెట్టనుంది. ఈ ఈవెంట్ కి ఇంకా రెండు నెలల సమయం ఉంది. గతంలో ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ 8 (iPhone 8), ఐఫోన్ 8 ప్లస్ (iPhone 8 Plus), ఐఫోన్ X (iPhone X) రాబోయే iOS వెర్షన్ ను అందుకోలేకపోవచ్చు.
iOS 17తో అత్యధిక ఫీచర్లు
ఆపిల్ iOS 17తో కొన్ని అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఆపిల్ 2024 నుంచి యూరోపియన్ చట్టాల ప్రకారం.. ఆపిల్ యాప్‌లు, థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌ల సైడ్ లోడింగ్‌కు సపోర్టు అందించనున్నారు. iOS 17 విడుదలతో iPhone యూజర్లకు అత్యధిక ఫీచర్‌లను అందించాలని ఆపిల్ యోచిస్తోంది. కానీ, ఆ ఫీచర్లు ఏంటి? అనేది మాత్రం ఇప్పటివరకూ రిలీవ్ చేయలేదు. iOS 17కి ఏ పరికరాలు అనుకూలంగా ఉంటాయనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. iPhone X, iPhone 8, iPhone 8 Plusతో సహా అనేక పాత పరికరాలకు Apple మద్దతును తగ్గిస్తుందని ఒక నివేదిక పేర్కొనడం గమనార్హం.