
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై మీ ఫోన్ నెంబర్ కనిపించదు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ షార్ట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం రోజు రోజుకూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది.
వాట్సాప్ త్వరలో ' ఫోన్ నెంబర్ ఫ్రైవసీ' పేరుతో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. అయితే ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది.
ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ లేటెస్ట్ ఆప్డేట్ ఉన్న బీటా యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇది వాట్సాప్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించడానికి ఆస్కారం ఉంది.
Details
వాట్సాప్ లో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ'
వాట్సాప్ కమ్యూనిటీలోని యూజర్లు తమ ఫోన్ నెంబర్ ఇతరులకు తెలియకుండా ఉండాలంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఈ ఫోన్ నెంబర్ ప్రైవసీ ఫీచర్ ను ఇనేబుల్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ఇనేబుల్ చేసుకుంటే కమ్యూనిటీ అడ్మిన్‌కు, అలాగే కాంటాక్ట్ ఇప్పటికే తమ ఫోన్ లో సేవ్ అయి ఉన్నవారికి ఈ ఫోన్ నెంబర్ లేదా ఆ నెంబర్ తో సేవ్ అయి ఉన్న పేరు కనపడుతుంది.
అయితే కమ్యూనిటీలోని ఇతరులకు మాత్రం ఈ ఆప్షన్ కనిపించదు. ముఖ్యంగా కమ్యూనిటీ ఆడ్మిన్ కూడా ఈ ఫీచర్ ను ఇనేబుల్ చేసుకోలేడు.