
WhatsApp: ఇక ఫేక్ ఫోటోలకు చెక్.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
ఈ వార్తాకథనం ఏంటి
యూజర్ల భద్రతను మరింత మెరుగుపరచే క్రమంలో వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.
తాజాగా స్పామ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు కొన్ని సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, ఇప్పుడు ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఈ సదుపాయం ద్వారా వాట్సప్ చాట్‌లోని చిత్రాల కోసం నేరుగా ఇంటర్నెట్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు.
ఇతర బ్రౌజర్లు, యాప్‌లను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా, అదే ప్లాట్‌ఫామ్‌లో ఆప్షన్ పొందుపరచడంతో యూజర్లు సులభంగా సమాచారాన్ని పొందగలుగుతారు.
ఈ కొత్త ఫీచర్ సహాయంతో వాట్సప్‌లో షేర్ చేసే కంటెంట్‌కు పారదర్శకతను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Details
వాట్సప్‌లో 'రివర్స్ ఇమేజ్ సెర్చ్'
వాట్సప్ చాట్‌లో ఉన్న ఫోటోను ఓపెన్ చేయగానే పైన కుడివైపున ఉన్న మూడు డాట్స్ మెనూ ద్వారా 'Search on Web' ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోగానే ఓ పాపప్ ఓపెన్ అవుతుంది.
అందులో సెర్చ్ పై క్లిక్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రారంభించవచ్చు. ఈ సదుపాయం ద్వారా ఆ ఫోటో ఎక్కడినుంచి వచ్చింది.
ఆన్‌లైన్‌లో ఇతర సందర్భాల్లో ఎలా వినియోగించారు, అది ఎడిట్ చేయబడిందా లేదా ఇతర మార్పులు కలిగించబడ్డాయా వంటి వివరాలు తెలుస్తాయి.
ఫోటోకు సంబంధించిన ఖచ్చితత్వం అంచనా వేయడం మరింత సులభమవుతుంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉండగా, రానున్న కొద్ది రోజుల్లో అన్ని యూజర్లకు ఈ ఫీచర్‌ను విడుదల చేయనుంది.