
జంతువులకు 'సూపర్ ఇంద్రియాలు'; 64ఏళ్ల నాటి 'ఐన్‌స్టీన్' లేఖలో సంచలన శాస్త్రీయ అంశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం విశ్వం గురించిన అవగాహనను పూర్తిగా మార్చడమే కాకుండా విశ్వం విశాలతను అన్వేషించడంలో తర్వాతి తరం శాస్త్రవేత్తలకు ఎంతో దోహదపడింది.
అతని మేథావి తనం శాస్త్రాన్ని అర్థంచేసుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదని, అతను మరిన్ని అంచనాలు, శాస్త్రీయ ఆలోచనలను కలిగి ఉన్నాడని ఇటీవల లభించిన ఐన్‌స్టీన్ లేఖ స్పష్టంచేస్తోంది.
మైఖేల్ నార్మల్ గ్లిన్ డేవిస్ అనే శాస్త్రవేత్తకు అక్టోబర్ 18, 1949న ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఐన్‌స్టీన్ కీలక విషయాలను పొందుపర్చారు.
జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం రెండింటి నుంచి ప్రకృతిని అర్థం చేసుకునే సూపర్ సెన్సెస్ జంతువులకు ఉన్నాయని ఐన్‌స్టీన్ 64ఏళ్ల క్రితమే అంచనా వేసినట్లు ఈ లేఖ ద్వారా స్పష్టమవుతోంది.
ఐన్‌స్టీన్
ఐన్‌స్టీన్ ఊహ, అంతర్దృష్టి నేటికీ స్ఫూర్తి: పరిశోధకులు
వలస పక్షులు, వాహక పావురాల్లో ఏదో తెలియని భౌతిక శాస్త్ర ప్రక్రియ ఉందని ఐన్‌స్టీన్ అంచనా వేశారు. వలస పక్షులు, వాహక పావురాల ప్రవర్తనపై పరిశోధన ఏదో ఒకరోజు ఇంకా తెలియని కొన్ని భౌతిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి దారితీయవచ్చని మైఖేల్ నార్మల్ గ్లిన్ డేవిస్‌కు లేఖలో ఐన్‌స్టీన్ పేర్కొన్నారు.
నాడు ఇద్దరు నైన్స్ దిగ్గజాల మధ్య జరిగిన ఉత్తర, ప్రత్యత్తర సంభాషణ, దశాబ్దాల తర్వాత, పక్షులు ఫోటోరిసెప్టర్లను ఉపయోగించి భూమి అయస్కాంత క్షేత్రాన్ని పసిగట్టగలవని ఇప్పుడు పరిశోధనల ద్వారా వెల్లడైంది.
ఈ రకమైన శాస్త్రీయ ఆలోచనను ఆనాడే ఐన్‌స్టీన్ ఊహించడం గమనార్హం. ఐన్‌స్టీన్ ఊహ, అంతర్దృష్టి నేటికీ మనకు స్ఫూర్తిని కలిగిస్తుందని నేచర్ పరిశోధకులు ఐన్‌స్టీన్ లేఖపై చేసిన అధ్యయనంలో పేర్కొన్నారు.