
WhatsApp: వాట్సాప్ యూజర్లకు మరో సర్ప్రైజ్.. వీడియో కాల్స్ కోసం కొత్త ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్ యూజర్లకు మరింత సౌకర్యం కల్పించేలా కొత్త ఫీచర్లను జోడించింది. ఇకపై గ్రూప్ కాల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. వ్యక్తిగతంగా లేదా మొత్తం గ్రూప్‌కు ఆహ్వానాలు పంపే సదుపాయం లభిస్తుంది. కాల్ ప్రారంభానికి ముందు పార్టిసిపెంట్స్‌కి నోటిఫికేషన్లు వస్తాయి. అంతేకాకుండా కాల్స్ ట్యాబ్‌లో రాబోయే కాల్స్ వివరాలు, హాజరయ్యే వారి జాబితా, షేర్ చేయగలిగే కాల్ లింకులు స్పష్టంగా కనిపిస్తాయి. షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ అయితే, కాల్ క్రియేటర్‌కి అలర్ట్ కూడా వస్తుంది. ఇక కాల్ సమయంలో ఇంటరాక్షన్ టూల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మాట్లాడే ముందు 'హ్యాండ్‌రైజ్ ఆప్షన్' వాడుకోవచ్చు. సంభాషణకు అంతరాయం కలగకుండా ఎమోజీ రియాక్షన్స్ పంపే సౌకర్యం కూడా జోడించారు.
Details
వాట్సాప్‌లో కాల్ షెడ్యూలింగ్ సదుపాయం
ఈ ఫీచర్లతో వాట్సాప్ మాత్రమే కాదు, ఇతర యాప్స్ కూడా యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ముందుకు వచ్చాయి. సిగ్నల్ ఇప్పటికే లింక్-బేస్డ్ కాల్స్, హ్యాండ్‌రైజ్, ఎమోజీ రియాక్షన్స్ అందించగా, గూగుల్ మీట్ మరింత ముందుకెళ్లి జెస్చర్-బేస్డ్ హ్యాండ్‌రైజ్, రియల్‌టైమ్ రియాక్షన్స్ అందిస్తోంది. అదే విధంగా సిస్కో వెబెక్స్ కూడా అనిమేటెడ్ ఎమోజీలు, పార్టిసిపెంట్ హ్యాండ్‌రైజింగ్ సదుపాయాలతో గ్రూప్ సంభాషణలను సులభతరం చేస్తోంది. మెటా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ అప్‌డేట్స్ ఫ్యామిలీ క్యాచ్‌అప్స్ నుంచి ప్రొఫెషనల్ మీటింగ్స్ వరకు కనెక్ట్ అవడంలో సాయపడతాయి. ముఖ్యంగా అన్ని కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తోనే రక్షించబడతాయని స్పష్టం చేసింది.