Anthropic: ఆంత్రోపిక్ స్వంత AI చిప్‌ల అభివృద్ధి వైపు అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా AI చిప్‌లను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలో ఈ కీలక చిప్‌ల కొరత పెరుగుతుండటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం. అయితే ఈ ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండగా, వాటిని అమలు చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆంత్రోపిక్ తన AI సాఫ్ట్‌వేర్, 'Claude' చాట్‌బాట్ అభివృద్ధికి గూగుల్ రూపొందించిన టీపీయూలు (TPUs), అలాగే అమెజాన్ చిప్‌లను ఉపయోగిస్తోంది.
వివరాలు
AI చిప్‌ల అభివృద్ధిపై పెద్ద టెక్ సంస్థలు దృష్టి
ఇటీవలే కంపెనీ గూగుల్, బ్రాడ్‌కామ్'తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. AI సేవలపై భారీ డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగి, 2025 చివర్లో సుమారు 9 బిలియన్ డాలర్లుగా ఉన్న రన్‌రేట్ ఆదాయం ఇప్పుడు 30 బిలియన్ డాలర్లను దాటింది. మరోవైపు, అధునాతన AI చిప్ తయారీకి దాదాపు అర బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నిపుణులైన ఇంజినీర్లను నియమించడం, తయారీ ప్రక్రియలో లోపాలు లేకుండా చూసుకోవడం వంటి కారణాల వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెటా, ఓపెన్‌ఏఐ వంటి పెద్ద టెక్ సంస్థలు కూడా తమకంటూ AI చిప్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం గమనార్హం.