ChatGPTని ఉపయోగిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్
తాను వ్యక్తిగతంగా చాట్ జిపిటిని ఉపయోగిస్తున్నానని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాట్ జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చాట్ జిపిటిలో కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్లు ఉన్నాయని తాను భావిస్తున్నానని, దానిని నిశితంగా పరిశీలిస్తున్నామని అతను పేర్కొన్నారు. తప్పుడు సమాచారం, నియంత్రణ, ప్రాముఖ్యత గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నియంత్రణ, నిర్దిష్ట సరిహద్దులు ఉండాలని కుక్ అభిప్రాయపడ్డాడు. నైతిక నిర్ణయాలు తీసుకోవడానికి, స్వీయ నియంత్రణను పాటించడానికి కంపెనీలు బాధ్యత వహించాలని కుక్ చెప్పుకొచ్చాడు.
యాపిల్ ఉద్యోగులు చాట్ జిపిటిని ఉపయోగించలేరు
Apple ఉద్యోగులు ఇకపై ChatGPT, ఇతర కృత్రిమ మేధస్సు సాధనాలను ఉపయోగించలేరు. ఎందుకంటే వారు తమ స్వంత సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగులు ChatGPTని ఉపయోగిస్తే, వారు తమ స్వంత ఉత్పత్తికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకోవచ్చని Apple ఆందోళన చెందుతోంది. ChatGPT అనేది OpenAI ద్వారా సృష్టించిన చాట్‌బాట్. ఇది కేవలం ఐదు రోజుల్లోనే 1 మిలియన్ వినియోగదారులతో వేగంగా అభివృద్ధి చెందింది. ఇది ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇవ్వగలదు. అదే విధంగా వ్యాసాలను కూడా రాయగలదు. మానవ ప్రవర్తనను పోలి ఉండే విధంగా ఇతర పనులను చేయగలదు.