LOADING...
Apple: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ అబిదూర్ చౌధరి ఆపిల్‌కు గుడ్‌బై 
ఐఫోన్ ఎయిర్ డిజైనర్ అబిదూర్ చౌధరి ఆపిల్‌కు గుడ్‌బై

Apple: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ అబిదూర్ చౌధరి ఆపిల్‌కు గుడ్‌బై 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌లో ఐఫోన్ ఎయిర్ రూపకల్పనకు కీలకంగా పనిచేసిన ఇండస్ట్రియల్ డిజైనర్ అబిదూర్ చౌధరి కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. ఐఫోన్ ఎయిర్ లాంచ్ వీడియోలో కూడా కనిపించిన ఆయన, ఇప్పుడు ఒక కృత్రిమ మేధస్సు స్టార్ట్‌అప్‌లో చేరినట్లు సమాచారం. డిజైన్ టీమ్‌లోఆయన ప్రభావం పెరుగుతున్న నేపథ్యంతో,ఈ రాజీనామా ఆపిల్‌ కంపెనీలోనే చర్చనీయాంశమైంది. 2019లో జోనీ ఐవ్ కంపెనీ వదిలిన సమయానికే చౌధరి ఆపిల్‌లో చేరి దాదాపు నాలుగేళ్లపాటు పనిచేశారు. ఐఫోన్ ఎయిర్ డిజైన్‌పై మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ అమ్మకాల విషయంలో ఆశించిన స్థాయికి చేరుకోకపోయినా, చౌధరి కంపెనీ నుంచి వెళ్లిపోవడానికి దీనికి సంబంధం లేదని ఆపిల్ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

2027లో రెండో తరం ఐఫోన్ ఎయిర్‌ విడుదలకు అవకాశం 

రెండో తరం ఐఫోన్ ఎయిర్‌ను 2027లో విడుదల చేసే అవకాశం ఉంది. జోనీ ఐవ్ వెళ్ళిన తర్వాత ఆపిల్ డిజైన్ టీమ్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగి, పాత సభ్యుల్లో చాలామంది రిటైర్ అవ్వడం లేదా ఇతర కంపెనీలకు మారిపోవడంతో, ఇప్పుడు జట్టులో కొత్త నియామకులు, జూనియర్ డిజైనర్లు ప్రధానంగా ఉన్నారు. ఈ ఏడాది చాలాకాలంగా డిజైన్ విభాగాన్ని చూసిన COO జెఫ్ విలియమ్స్ కూడా కంపెనీని వీడారు. ఆయన వెళ్లిన తర్వాత ఆపిల్ డిజైన్ టీమ్స్ నేరుగా CEO టిమ్ కుక్‌కి నివేదిక ఇస్తాయని కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో,అలెన్ డై నేతృత్వంలో ఉన్న యూజర్ ఇంటర్‌ఫేస్ విభాగం నుంచి కూడా పలువురు వెళ్లిపోవడంతో,సంస్థలో మొత్తం నిర్మాణంలో మార్పుల దశ కొనసాగుతోంది.