
Apple Event 2025: ఆపిల్ బిగ్ ఈవెంట్ ఎప్పుడు? ఈసారి ఏమేం రాబోతున్నాయ్?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తన అతి పెద్ద వార్షిక ఈవెంట్ (Apple Event 2025)కి సిద్ధమవుతోంది. గతంలా ఈ సంవత్సరం కూడా ఆపిల్ ఈవెంట్ అమెరికాలోని ఆపిల్ పార్క్‌లో నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఐఫోన్ 17 సిరీస్, అలాగే ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, మాక్ డివైజ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి వివిధ కొత్త ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశముంది. ఇప్పటికే ఉన్న డివైజ్‌ల కోసం iOS 26 అప్‌డేట్ ను కూడా ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి. భారతీయ కాలమానం ప్రకారం, ఈ ఈవెంట్ సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు లైవ్‌లో చూడవచ్చు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ లేదా యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
వివరాలు
ఐఫోన్ 17 సిరీస్
ఈ సంవత్సరం ఆపిల్ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా తదుపరి తరం ఐఫోన్ 17 సిరీస్ నిలవనుంది. ఇందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ పూర్వపు ప్లస్ వెర్షన్ను తొలగించి, దాని స్థానంలో ఎయిర్ వెర్షన్ను పరిచయం చేస్తోంది. ఈ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వంటి డివైజ్‌లతో కఠిన పోటీని ఎదుర్కొంటాయి. ప్రో మోడళ్లలో కొత్త డిజైన్ మార్పులు ఉండనున్నాయి. ముఖ్యంగా 48MP పెరిస్కోప్ లెన్స్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఈ మోడళ్లలో పొందుపరచబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది గత ఐఫోన్ 16లో ఉన్న 12MP పెరిస్కోప్ లెన్స్‌ను భర్తీ చేస్తుంది.
వివరాలు
Liquid Glass UI ఫీచర్
ఈవెంట్‌లో iOS 26 అప్‌డేట్ ను కూడా అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్‌లో Liquid Glass UI ఫీచర్ ఉండనుందని అంచనా. దీని ద్వారా యూజర్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా పారదర్శకంగా, గ్లాస్ లుక్‌తో కనిపించేలా డిజైన్ చేయబడుతుంది. ఇది iOS 7 తరువాతి ప్రధాన మార్పుగా పరిగణించబడుతోంది. అదనంగా, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, మరిన్ని ఫంక్షనల్ అప్‌డేట్లు ఇందులో ఉండనున్నాయి. అంతేకాక, ఈవెంట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 11, అలాగే ప్రీమియం మోడల్ ఆపిల్ వాచ్ అల్ట్రా 3ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.