Page Loader
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన

ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐ ఫోన్ 15 సిరీస్ లాంచ్ డేట్ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2023
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సంస్థ ప్రతేడాది ఒక ఈవెంట్‌ను నిర్వహించి, ఆ ఈవెంట్ లో ఆ సంవత్సరానికి సంబంధించిన లేటెస్ట్ ఆపిల్ సిరీస్ ఐ ఫోన్స్ లాంచ్ చేస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 12వ తేదిన ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆపిల్స్ లవర్స్ కు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ లో జరిగే ఈవెంట్ లో ఆపిల్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేస్తామని స్పష్టం చేసింది. ఆపిల్ ఫిఫ్టీన్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి.

Details

యాపిల్ 15 స్మార్ట్ ఫోన్ లో అధునాతన ఫీచర్లు  

వాటితో పాటు ఆపిల్ వాచ్ 9 సిరీస్ ను అలాగే ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఆపిల్ 15 స్మార్ట్ ఫోన్ లో 6.7 ఇంచ్ డిస్ ప్లే ఉండనుంది. ఇందులో కొత్తగా ఏ 17 చిప్‌ను, అలాగే 5 జీ క్వాల్ కాం మోడల్ చిప్‌ను అమర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కి యూఎస్ బీ-' సీ చార్జింగ్ సపోర్టు ఉన్నట్లు సమాచారం. ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ కెమెరా విషయానికి వస్తే, జూమింగ్ క్యాపబిలిటీస్‌ని మరింత పెంచారని, సరికొత్త పెరిస్కోప్ లెన్స్ ద్వారా 5x నుంచి 6x వరకు ఆప్టికల్ జూమ్‌ను పెంచడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.