LOADING...
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్17 సిరీస్ వచ్చేస్తోంది..లాంచ్ కు ముందే లీక్  
ఆపిల్ ఐఫోన్17 సిరీస్ వచ్చేస్తోంది..లాంచ్ కు ముందే లీక్

iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్17 సిరీస్ వచ్చేస్తోంది..లాంచ్ కు ముందే లీక్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
07:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ అభిమానులకు ఒక శుభవార్త. ప్రఖ్యాత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో కేవలం ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు మోడళ్లను ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఆపిల్ సంస్థ తమ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయిన iOS 26 అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌లో ఉన్నఅన్ని మోడల్స్‌కి ఇదే iOS 26 అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. ఈ లైనప్‌లో ఐఫోన్ 17,ఐఫోన్ 17 ఎయిర్,ఐఫోన్ 17 ప్రో,ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు 2025 సెప్టెంబర్ నెల మొదటివారంలో లాంచ్ కానున్నట్లు అంచనాలు ఉన్నాయి.

వివరాలు 

ఐఫోన్ 17 సిరీస్ ధరలను పెంచే అవకాశం

ఇక తాజా నివేదికల ప్రకారం, అమెరికాలో కొత్త టారిఫ్ చార్జీలను దృష్టిలో ఉంచుకుని, ఆపిల్ ఈసారి ఐఫోన్ 17 సిరీస్ ధరలను పెంచే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ కంపెనీ ధరల విషయంలో స్థిరతను చూపుతోంది. అయితే, ఈ ఏడాది ఆ ట్రెండ్ మెల్లగా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మాక్స్ ధరలు మునుపటితో పోలిస్తే బాగా పెరిగే అవకాశముంది. వివరాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 11 నుంచి 13 తేదీల మధ్యలో ఐఫోన్ 17 సిరీస్‌ను ఆపిల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

వివరాలు 

అంచనా ధరలు ఇలా ఉండొచ్చు: 

గత సంవత్సరాల ధరల పద్ధతులను పరిశీలిస్తే.. ఈసారి కూడా ఆపిల్ తమ ఎంట్రీ లెవల్ మోడల్స్‌కు సుమారు అదే స్థాయిలో ప్రారంభ ధరలను ఉంచే అవకాశం ఉంది. వాటి ప్రకారం: ఐఫోన్ 17 - సుమారు రూ. 89,900 ఐఫోన్ 17 ఎయిర్ - సుమారు రూ. 99,900 ఐఫోన్ 17 ప్రో - సుమారు రూ. 1,39,900 ఐఫోన్ 17 ప్రో మాక్స్ - సుమారు రూ. 1,64,900 ఇవి కేవలం ఊహాగానాలే. సంస్థ నుంచి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. అయినప్పటికీ, ఈసారి కొత్త మోడల్స్ ధరలు మరింత పెరిగే అవకాశముంది.

వివరాలు 

డిజైన్, కలర్ ఆప్షన్ల వివరాలు: 

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ విషయానికి వస్తే,స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ గత ఏడాది విడుదలైన ఐఫోన్ 16 మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. దీంట్లో USB-C పోర్ట్,యాక్షన్ బటన్ వంటి అంశాలు కనిపించనున్నాయి. కానీ ప్రో వేరియంట్లు మాత్రం ప్రత్యేకతను చూపేలా ఉంటాయి. వాటిలో రెక్టాంగులర్ ఆకారంలో కెమెరా ఐలాండ్ డిజైన్ ఉంటుంది.ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్ల తరహాలో ఉంటుంది. ఇక ఈ ఏడాది ఐఫోన్ 17 ప్లస్ మోడల్ను సంస్థ ప్రవేశపెట్టకపోవచ్చు.దాని బదులుగా ఐఫోన్ 17 ఎయిర్ అనే కొత్త వేరియంట్‌ను తీసుకురావచ్చు. కలర్ ఆప్షన్లు విషయానికొస్తే: ఐఫోన్ 17,17 ఎయిర్ మోడల్స్: అల్ట్రామెరైన్,టీల్,బ్లాక్,పింక్,వైట్ ఐఫోన్ 17 ప్రో,ప్రో మాక్స్ మోడల్స్: బ్లాక్, సిల్వర్, వైట్, కొత్తగా స్కై బ్లూ

వివరాలు 

స్పెసిఫికేషన్లు - శక్తివంతమైన హార్డ్‌వేర్: 

ఐఫోన్ 17 సిరీస్‌కి సంబంధించి ఫీచర్లు కూడా ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఈ సిరీస్‌లోని నాలుగు ఫోన్లలోనూ మెరుగైన బ్రైట్‌నెస్, 120Hz ప్రోమోషన్ టెక్నాలజీ కలిగిన OLED డిస్‌ప్లే ఉండనుంది. చిప్‌సెట్ విషయానికొస్తే: ఐఫోన్ 17, 17 ఎయిర్ మోడల్స్.. A19 చిప్ ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్..A19 ప్రో చిప్‌సెట్ కెమెరా సెటప్ విషయంలో,ఈసారి అన్నీ మోడల్స్‌లోనూ 24MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

వివరాలు 

బ్యాక్ కెమెరాల విషయంలో: 

ఐఫోన్ 17 ఎయిర్ - ఒక్కటి 48MP రియర్ కెమెరా ఐఫోన్ 17 - డ్యూయల్ కెమెరా సెటప్ ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ - ట్రిపుల్ 48MP కెమెరాలు, 8K వీడియో రికార్డింగ్, 7x జూమ్ కెపాసిటీ ఇవన్నీ ఇప్పటివరకు వచ్చిన లీక్స్, నివేదికల ఆధారంగా ఉన్న సమాచారం మాత్రమే. ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన రాగానే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.