Page Loader
WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్

WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 30, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2023 ఈవెంట్ జూన్ 5న ప్రారంభమవుతుందని ప్రకటించింది. వర్చువల్ ఈవెంట్ జూన్ 5 నుండి ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుంది. ఇది కూడా గత సంవత్సరం లాగానే ఉంటుంది. WWDC 2023 గురించిన వివరాలను వెల్లడిస్తూ, ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సుసాన్ ప్రెస్‌కాట్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సమావేశం అతిపెద్ద ఈవెంట్ అని అన్నారు. ఈ ప్రత్యేకమైన ఈవెంట్‌లో ఆన్‌లైన్‌లో పాల్గొనచ్చని ప్రెస్కాట్ చెప్పారు. సాధారణంగా, ఈ ఈవెంట్ లో ఆపిల్ iOS, macOS, iPadOS, watchOS, tvOS తర్వాతి వెర్షన్స్ ను ప్రకటిస్తుంది. వీటితోనే iOS 17ని ప్రకటించాలని భావిస్తుంది.

ఆపిల్

WWDC లో ఆపిల్ ఆగ్మెంటెడ్ లేదా వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ను ప్రకటించే అవకాశం

ఈ సంవత్సరం WWDC లో కంపెనీ ఆగ్మెంటెడ్ లేదా వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ గురించి ప్రకటించే అవకాశం ఉంది. తన Silicon Mac Pro గురించి కూడా ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. గూగుల్ ఇటీవల తన I/O ఈవెంట్ 2023ని మే 10 నుండి హోస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ఈవెంట్‌లో, ఆండ్రాయిడ్ తర్వాతి వెర్షన్ తో పాటు 20కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను ప్రకటిస్తుంది. రాబోయే Pixel 7a కూడా భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ ను ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో చూడగలరు.