LOADING...
Apple Vision Pro: శుక్లాల శస్త్రచికిత్స తొలిసారి ఆపిల్ విజన్ ప్రో వినియోగం
శుక్లాల శస్త్రచికిత్స తొలిసారి ఆపిల్ విజన్ ప్రో వినియోగం

Apple Vision Pro: శుక్లాల శస్త్రచికిత్స తొలిసారి ఆపిల్ విజన్ ప్రో వినియోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్'కు చెందిన నేత్ర వైద్యుడు Dr. Eric Rosenberg అరుదైన ఘట్టాన్ని నమోదు చేశారు. ఆపిల్ విజన్ ప్రో హెడ్సెట్‌ను ఉపయోగిస్తూ తొలిసారిగా కంటిపొర(కాటరాక్ట్‌)శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. 2025 అక్టోబర్‌లో ఈ సర్జరీ చేయగా,ఆ తర్వాత ఇదే టెక్నాలజీతో వందలాది ఆపరేషన్లు చేశారు. ఆయన రూపొందించిన ScopeXRప్లాట్‌ఫాం ద్వారా 3డీ డిజిటల్ మైక్రోస్కోప్ నుంచి వచ్చే లైవ్ విజువల్స్‌ను నేరుగా Vision Proలో చూసే అవకాశం ఉంది. దీంతో వైద్యులు 3డీ స్టీరియోస్కోపిక్‌గా శస్త్రచికిత్స ప్రాంతాన్ని చూడటంతో పాటు ముందస్తు పరీక్షల డేటాను కూడా ఒకేసారి చూడగలుగుతున్నారు. అంతేకాదు,ప్రపంచంలో ఎక్కడున్నా ఇతర నిపుణ వైద్యులు కూడా రియల్‌టైమ్‌లో ఆపరేషన్‌లో పాల్గొనే అవకాశం ఉండటంతో వైద్య రంగంలో ఇది గేమ్‌ ఛేంజర్‌గా మారనుంది.

వివరాలు 

స్మార్ట్ గ్లాసెస్‌పై ఫోకస్

కొత్తగా శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులకు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సర్జన్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ రోసెన్‌బర్గ్ తెలిపారు. ఇదిలా ఉండగా, Apple తమ Vision Proను సాధారణ వినియోగదారుల కంటే వైద్య, విమానయాన శిక్షణ, ఇండస్ట్రియల్ డిజైన్ వంటి రంగాల్లో ఉపయోగించే దిశగా ముందుకు తీసుకెళ్తోంది. $3,499 ధర, పెద్ద సైజ్ కారణంగా వినియోగదారుల్లో ఆదరణ నెమ్మదిగా ఉండటంతో కంపెనీ ఈ వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఇటీవలే కొత్త M5 చిప్‌తో అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం కొత్త Vision హెడ్‌సెట్ల అభివృద్ధిపై దృష్టి తగ్గించి, తేలికపాటి స్మార్ట్ గ్లాసెస్‌పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

Advertisement