Page Loader
APPLE WATCH SERIES 9, ULTRA 2 : వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా -2 స్పెషల్ ఫీచర్స్ ఇవే 
విడుదలైన ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా వాచ్ -2

APPLE WATCH SERIES 9, ULTRA 2 : వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా -2 స్పెషల్ ఫీచర్స్ ఇవే 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 12, 2023
11:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా వాచ్-2ని కంపెనీ ఆవిష్కరించింది. ఈ మేరకు స్మార్ట్‌వాచ్‌లు, వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా (2వ తరం)ని 'వండర్‌లస్ట్' ఈవెంట్‌లో సంస్థ ప్రకటించింది . ఈ కొత్త మోడల్‌లు ఆన్-డివైస్ ప్రాసెసింగ్, "డబుల్ ట్యాప్" వంటి అప్ డేటెడ్ ఫీచర్స్ తో ముందుకొచ్చింది. ఇందులో ఫోన్ కాల్స్ కి సమాధానం ఇచ్చేందుకు, స్నూజ్ అలారం లాంటి వాటికి అనుమతిస్తుంది. కొత్త సెన్సార్‌లతో మెరుగైన ఆరోగ్య-ట్రాకింగ్ సామర్థ్యాలను పొందుపర్చారు. వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా సెప్టెంబర్ 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ సంస్థ అధికారిక స్టోర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ఎస్ చిప్ తో తయారు కానుంది

DETAILS

స్వచ్ఛమైన విద్యుత్‌నే ఉపయోగిస్తామన్న ఆపిల్ సంస్థ

ఆపిల్ వాచ్, అల్ట్రా-2 దాదాపుగా 36 గంటల బ్యాప్ అప్ ఇస్తుంది. అయితే మొదటి తరం మోడల్ లో డిజైన్ మరీ పెద్దగా ఉంది. ఇది 3,000-నిట్స్ బ్రైట్ డిస్‌ప్లే, S9 చిప్, కొత్త సైక్లింగ్ ఫీచర్‌లు, డబుల్ ట్యాప్ ఫీచర్లు కలిగి ఉన్నాయి. లో లెవెల్ స్టాండార్డ్ మోడ్ లో పెట్టుకుంటే 72 గంటల స్టాండ్ బై టైమ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. తొలి కార్బన్ రహిత ఉత్పత్తిగా సిరీస్ 9 వాచ్ లో బ్యాటరీ తయారీలో భాగంగా తొలిసారిగా కోబాల్ట్ వినియోగించారు. పునరుత్పత్తి చేయదగిన అల్యూమినియం, బంగారం, టిన్, కాపర్‌ని ఉపయోగించింది. ఈసారి నుంచి యాపిల్ వాచ్ తయారీలో స్వచ్ఛమైన విద్యుత్‌నే ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.