
Google: గూగుల్ హెచ్చరిక.. ఫిషింగ్ స్కామ్ పట్ల అప్రమత్తత అవసరం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
అత్యంత తెలివైన టెక్నాలజీ నిపుణులను సైతం మోసం చేస్తున్న ఓ శక్తివంతమైన ఫిషింగ్ స్కాం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ స్కాం బారి నుండి తాను కూడా తృటిలో తప్పించుకున్నానని సాఫ్ట్‌వేర్ డెవలపర్ నిక్ జాన్సన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఇది చాలా అధునాతనంగా తయారు చేసిన మోసపూరిత ఇ మెయిల్ అని ఆయన అన్నారు.
Details
గూగుల్ మెయిల్‌గా కనిపించే నకిలీ ఇమెయిల్
జాన్సన్ చెప్పిన ప్రకారం, ఆ స్కామ్ ఇమెయిల్ అసలైన గూగుల్ మెయిల్‌లా కనిపించిందని తెలిపారు.
అంతేకాక అది గూగుల్ డొమైన్ కీస్ ఐడెంటిఫైడ్ మెయిల్ పరీక్షను కూడా క్లియర్ చేసి జీమెయిల్ ఇన్‌బాక్స్‌లో సాధారణ మెయిల్‌లా కనిపించిందని చెప్పారు.
జాన్సన్ చెప్పినట్టుగా, ఆ ఇమెయిల్‌లో తన గూగుల్ ఖాతా ఓ సబ్‌పోనా(కోర్టు ఆదేశం)ద్వారా విచారణకు లోనైందని పేర్కొంది.
అసలు ఈ మెయిల్‌లో ఉన్న ఏకైక క్లూ అది `accounts.google.com` కాదు,sites.google.com` అనే వెబ్ అడ్రస్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది.
దానిపై క్లిక్ చేస్తే నిజమైన గూగుల్ లాగిన్ పేజీలా కనిపించే ఓ నకిలీ సపోర్ట్ పోర్టల్ ఓపెన్ అయింది. దీనిలో లాగిన్ డిటెయిల్స్ ఇవ్వడం ద్వారా వినియోగదారుల సమాచారం దొంగలించే అవకాశం ఉంది.
Details
లోపాన్ని గుర్తించాం
ఈ మోసాన్ని గమనించిన గూగుల్ సంస్థ వెంటనే స్పందించింది. స్కామర్లు ఉపయోగించిన లోపాన్ని ఇప్పటికే గుర్తించి ఆడ్డుకున్నామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.
అదేవిధంగా, భవిష్యత్‌లో ఇలాంటి మోసాలకు భయపడకుండా ఉండేందుకు వినియోగదారులు పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
గూగుల్ ఎప్పుడూ మీ పాస్‌వర్డ్, వన్‌టైం పాస్వర్డ్‌లు, పుష్ నోటిఫికేషన్‌లను కన్ఫర్మ్ చేయమని అడగదు. అలాగే, మీకు ఫోన్ చేయదు కూడా అని సంస్థ స్పష్టం చేసింది.
Details
వినియోగదారులకు గూగుల్ సూచన
మీ ఖాతా సంబంధిత ఇమెయిల్స్‌లో ఉన్న లింకులపై క్లిక్ చేయాలంటే ముందుగా పరిశీలించాలని గూగుల్ సూచిస్తోంది.
ప్రభుత్వ ఏజెన్సీ నుంచి సమాచార అభ్యర్థన వచ్చినపుడు, గూగుల్ మీకు ముందుగా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తుందన్నారు.
మొత్తానికి, గూగుల్ డిజిటల్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండమని స్పష్టంగా హెచ్చరించింది.