
Brain-Eating Amoeba: భారతదేశంలో మెదడును తినే అరుదైన వ్యాధి.. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? చికిత్స ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ప్రస్తుతం అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. సాధారణంగా 'మెదడును తినే అమీబా' అని పిలవబడే ఈ వ్యాధి, రాష్ట్రంలోని ప్రజలను భయానికి గురిచేసింది,ఎందుకంటే ఇప్పటివరకు 19మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 69కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో మూడు నెలల శిశువు నుండి 91ఏళ్ల వృద్ధురాలు వరకు PAM బారిన పడ్డారు. తాజాగా, తిరువనంతపురం నుండి వచ్చిన 17ఏళ్ల అబ్బాయి ఈ వ్యాధికి గురైనట్లు అధికారులు ధృవీకరించారు. అతను తన మిత్రులతో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్లు తెలిసింది. బాధిత టీనేజర్'లో వ్యాధి లక్షణాలు బయటపడడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ పూల్‌ను మూసివేసి నీటినుండి నమూనాలను పరీక్షలకు పంపించారు.
వివరాలు
అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ
కేరళ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ప్రకారం,ఈ ఏడాది రాష్ట్రంలో PAM కేసులు 69కి చేరగా, మొదట మలప్పురం,కోజికోడ్ జిల్లాల్లో మాత్రమే కనిపించినా,ఇప్పుడు కేరళ మొత్తం ప్రాంతంలో వ్యాప్తి చెందడం గమనార్హం. ఇటీవల మలప్పురం జిల్లాలో శోభన(56),రతీష్(45)కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సూచించారు. 'నిల్వ ఉన్న నీళ్లు,మురికి నీటి కుంటలు,పశువులను శుభ్రం చేసే జలాశయాల్లో కనీసం ముఖం కూడా కడుక్కోవద్దని సూచించారు. బావులు,ఈత కొలన్లలో శాస్త్రీయంగా క్లోరిన్ కలపాలని, వాటర్ థీమ్ పార్కుల్లో సరైన మోతాదులో క్లోరినేషన్ నిర్వహించాలని, స్నాన సమయంలో జాగ్రత్తలు పాటించమని సూచించారు.
వివరాలు
ఎలా వ్యాపిస్తుంది?
PAM అమీబా సాధారణంగా ముక్కు లేదా చెవులు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడులో నివాసం ఏర్పాటు చేస్తుంది,తద్వారా మెదడు కణాలను నాశనం చేసి తీవ్రమైన వాపు, జ్వరం,ఇతర లక్షణాలతో మరణానికి దారితీస్తుంది. వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. రెండు వారాల తర్వాత వాసన కోల్పోవడం, తలనొప్పి, వాంతులు, వికారం, మగత, మూర్ఛ, మెడ దృఢత్వం కోల్పోవడం, వెలుగును చూడలేకపోవడం, దిక్కు తెలియక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వివరాలు
చికిత్సా విధానం
గత ఆరు దశాబ్దాల్లో ఈ వ్యాధి నుంచి బయటపడ్డ దాదాపు అందరు బాధితుల మెదడులో ఇది వ్యాప్తి చెందకముందే గుర్తించారు. ఈ అమీబా సోకిన వ్యక్తికి వెంటనే సరైన చికిత్స అందించాలి. లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంది ప్రారంభ దశలో గుర్తించి, వెంటనే యాంటీమైక్రోబయల్ లేదా అమీబిసైడల్ మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. నిర్ధారణ ఆలస్యమైతే లేదా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందితే, చికిత్సా విధానాలను మెరుగుపరచడంలో సమస్యలు ఎదురవుతాయి.
వివరాలు
చికిత్సా విధానం
కేరళలో PAM తొలి కేసు 2016లో నమోదయినప్పటి నుండి 2017,2023లో మరికొన్ని కేసులు నమోదయ్యాయి,కానీ గతేడాది 36మందికి అత్యధికంగా నిర్ధారణ కాగా,ఈ ఏడాది ఇప్పటికే కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ విధంగా ఈ వ్యాధి కేరళలో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది, ప్రజలు, ఆరోగ్య అధికారులందరూ అత్యంత జాగ్రత్త పాటించడం అత్యవసరమైంది.