Page Loader
కంటెంట్ క్రియేటర్ల కోసం  రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai
డీప్ లెర్నింగ్ నెట్‌వర్క్‌లతో పనిచేసి డేటాను విశ్లేషిస్తుంది

కంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 17, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కంటెంట్ క్రియేటర్లు కంటెంట్‌ను ఆకర్షణీయంగా చేయడానికి సంగీతంపై ఎక్కువగా ఆధారపడతారు. కానీ అటువంటి సంగీతానికి కాపీరైట్ సమస్యలను ఎదుర్కుంటున్నారు. Beatoven.ai, భారతదేశంలో మొట్టమొదటి AI-సపోర్ట్ చేసే మ్యూజిక్ ను అందిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కంటెంట్ ప్రపంచంలో మ్యూజిక్ ముఖ్యమైన భాగం. టిక్‌టాక్ నుండి ఇన్‌స్టాగ్రామ్ నుండి స్నాప్‌చాట్ వరకు, నేపధ్య సంగీతం కంటెంట్‌ను మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అయినప్పటికీ, కాపీరైట్ చట్టాలు ఈ మధ్య క్రియేటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఫలితంగా కంటెంట్-క్రియేటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కాపీరైట్ చట్టాలకు కట్టుబడి ఉండే కంటెంట్‌పై ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. IIIT-అలహాబాద్ పూర్వ విద్యార్థులు సిద్ధార్థ్ భరద్వాజ్, మన్సూర్ రహిమత్ ఖాన్ 2021లో Beatovan.ai ను స్థాపించారు.

కంటెంట్

రాయల్టీ-రహిత నేపథ్య సంగీతాన్ని సృష్టించడానికి ఇది సులభతరం చేస్తుంది

మ్యూజిక్ లైసెన్సింగ్, సంబంధిత కాపీరైట్ ప్రశ్నలు కంటెంట్ క్రియేటర్లకు ఈ సమస్యను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. క్రియేటర్లకు ఈ పనిని సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వీడియోలు, రీల్స్, పాడ్‌క్యాస్ట్‌లలో అసలైన, రాయల్టీ-రహిత నేపథ్య సంగీతాన్ని సృష్టించడానికి సులభతరం చేస్తుంది. 2021లో ప్రారంభించబడిన ఈ సంస్థ సంగీతాన్ని టెక్నాలజీతో కలపడం లక్ష్యంగా పెట్టుకుంది. Beatoven.ai డీప్ లెర్నింగ్ నెట్‌వర్క్‌లతో పనిచేసి డేటాను విశ్లేషిస్తుంది. ఒక వినియోగదారు కావలసిన సంగీత పరమైన అంశాల్ని సెట్ చేస్తే AI ఆదాయాన్ని సంపాదించడానికి కంపెనీకు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌ ఉంది. $20 (దాదాపు రూ. 1,600), $40 (దాదాపు రూ. 3,300), $100 (దాదాపు రూ. 8,100) విలువైన మూడు రకాల సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి.