
Jupiter : భూ గుర్వాత్వాకర్షణతో గురుగ్రహంపై యాత్ర
ఈ వార్తాకథనం ఏంటి
సౌర కుటుంబంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని ఇతర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపడం కష్టమే.
దీని కోసం తక్కువ ఇంధనంతో యాత్రకు శ్రీకారం చుట్టారు.
తాజాగా గురుగ్రహం చుట్టూ ఉన్న చందమామలపై పరిశోధన కోసం ఐరోపా అంతరిక్షం సంస్థ (ఈఎస్ఏ) ప్రయోగించిన 'జ్యూస్' వ్యోమనౌక కొత్త ఒరవడికి నాంది పలికింది.
చరిత్రలో మెట్టమొదటి సారిగా గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా వాడుకోనుంది.
గతేడాది పుడిమి నుంచి బయల్దేరిని ఈ స్పేస్ క్రాప్ట్ భూమికి తిరిగి రానుంది.
Details
గురు గ్రహంపై మనుగడ సాధించేందుకు పరిశోధనలు
సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం గురుడు. దాని చుట్టూ తిరుగుతున్న 95 చందమామల్లో గ్యానీమేడ్, క్యాలిస్టో, యూరోపాలు ప్రస్తుతం శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అక్కడ జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీనికోసం ఈఎస్ఏ గతేడాది ఏప్రిల్ 14న జ్యూస్ వ్యోమనౌకను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది 2031లో గురు గ్రహానికి చేరువ కానుంది.
ప్రస్తుతం ఇది భూమికి కిలోమీటర్ల దూరంలో పయనిస్తోంది. ముఖ్యంగా వ్యోమనౌకను గురుడి వద్దకు పంపడానికి 60 టన్నుల ఇంధనం అవసరం.
ప్రస్తుతం శాస్త్రవేత్తలు దీని కోసం ప్రత్యామ్నాయ మార్గాలను నిర్ధేశిస్తున్నారు.