Sridhar Vembu: 'భారత్ మాతకు మీ ప్రతిభ అవసరం'.. అమెరికాలోని భారతీయులకు శ్రీధర్ వెంబు పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీధర్ వెంబు(Sridhar Vembu) అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఓపెన్ లెటర్ రాస్తూ కీలక పిలుపునిచ్చారు. "భారత్ మాతకు మీ ప్రతిభ అవసరం" అంటూ ఆయన స్వదేశానికి తిరిగి రావాలని కోరారు. 'ఎక్స్' వేదికగా షేర్ చేసిన ఈ లేఖలో భారత్ టెక్నాలజీ రంగంలో మరింత బలపడాలంటే దేశీయ ప్రతిభ అవసరమని చెప్పారు. 37 సంవత్సరాల క్రితం తాను కూడా అమెరికాకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, భారతీయులు అక్కడ మంచి విద్య, సంస్కృతి ఆధారంగా గొప్ప విజయాలు సాధించారని పేర్కొన్నారు.
వివరాలు
స్వదేశానికి తిరిగి రావాలని శ్రీధర్ విజ్ఞప్తి
అమెరికా మనకు మంచి అవకాశాలు ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు ఉండాలని అన్నారు. అయితే ప్రస్తుతం కొంతమంది అమెరికన్లు భారతీయులు తమ ఉద్యోగాలను తీసుకుంటున్నారని భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో గౌరవం, అభివృద్ధి, భద్రత ఇవన్నీ ఒక దేశ టెక్నాలజీ శక్తిపైనే ఆధారపడతాయని చెప్పారు. భారత్‌లో సరిపడ మేధస్సు ఉన్నప్పటికీ అది విదేశాలకు వెళ్తోందని, ఇప్పుడు ఆ ప్రతిభ దేశ అభివృద్ధికి అవసరమని అన్నారు. దేశంలో ఉన్న యువతకు మీరు సాధించిన అనుభవం, నాయకత్వం చాలా అవసరమని, అందుకే స్వదేశానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్వదేశానికి రండి.. టెక్నాలజీ అభివృద్ధికి మీరే బలం: శ్రీధర్ వెంబు
Open letter to Indians in America.
— Sridhar Vembu (@svembu) April 27, 2026
--
Dear brothers and sisters from Bharat:
Like I did 37 years ago, you arrived in America with no money but with a good education and cultural heritage from Bharat. You achieved outstanding success. America was good to us. For that we must…