LOADING...
Brain: జీవితాంతం మెదడు ఎలా మారుతుంది?.. ఓ అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!
దాదాపు 4,000 మంది వ్యక్తుల మెదడు స్కాన్‌లను అధ్యయనం విశ్లేషించింది

Brain: జీవితాంతం మెదడు ఎలా మారుతుంది?.. ఓ అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

మనిషి మెదడు అభివృద్ధి ఐదు దశల్లో సాగుతుందని, పెద్దవారి దశ నిజానికి ముప్పై ఏళ్ల ప్రారంభంలోనే మొదలవుతుందని తాజాగా వచ్చిన ఒక అధ్యయనం వెల్లడించింది. శిశువు దశ నుంచి 90 ఏళ్ల వయస్సు వరకూ ఉన్న దాదాపు 4,000 మంది మెదడు స్కాన్‌లను పరిశీలించిన పరిశోధకులు, మెదడు నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకునే నాలుగు ప్రధాన మలుపులను గుర్తించారు. ఇవి సుమారు తొమ్మిదో ఏట, 32 ఏళ్ల వయస్సులో, 66 ఏళ్ల దగ్గర, తరువాత 83 ఏళ్ల ప్రాంతంలో కనిపించాయని చెప్పింది. పుట్టినప్పటి నుంచి తొమ్మిదో ఏటిదాకా 'చైల్డ్‌హుడ్' (childhood)దశ ఉండగా, ఆ తర్వాత దాదాపు 32 ఏళ్ల వరకు 'అడోళసెన్స్'(adolescence) దశగా మెదడు మార్పులు కొనసాగుతాయని తేలింది.

వివరాలు 

జీవితం లోనే దీర్ఘకాలం కొనసాగే దశ

ముప్పైల్లోకి వచ్చేసరికి మెదడు వైర్లింగ్ పెద్దల మోడ్‌కి మారుతూ, జీవితం లోనే దీర్ఘకాలం కొనసాగే దశ మొదలవుతుందని నివేదిక చెబుతోంది. తరువాత సుమారు 66 ఏళ్ల నుంచి 'ఎర్లీ ఏజింగ్' దశ, 83 నుంచీ 'లేట్ ఏజింగ్' దశగా వృద్ధాప్య మార్పులు స్పష్టమవుతాయని పరిశోధకులు తెలిపారు. శిశు దశ నుంచి బాల్యంలోకి వచ్చినప్పటికి, మెదడులో ఉన్న అనేక సైనాప్స్ తగ్గిపోయి, ఎక్కువగా పనిచేసే కనెక్షన్‌లు మాత్రమే నిలిచే విధంగా 'నెట్‌వర్క్ కన్సాలిడేషన్' జరుగుతుందని అధ్యయనం చెబుతోంది. ఈ దశలో మెదడు వైర్లింగ్ సామర్థ్యం కొంత తగ్గినా, గ్రే, వైట్ మ్యాటర్ పరిమాణం మాత్రం వేగంగా పెరిగే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు

వివరాలు 

వృద్ధాప్య కారణంగా మెదడులో కనెక్టివిటీ తగ్గిపోవడం

అలాగే యవ్వన దశలో వైట్ మ్యాటర్ పెరిగి, మెదడులోని కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు మరింత మెరుగుపడతాయని, దాంతో గ్రహించే శక్తి కూడా అభివృద్ధి చెందుతుందని వివరించింది. అయితే, ఇరవైల్లో చివరి దశలో (సుమారు 25 నుంచి 29 ఏళ్లు) ఉన్నవారు యథార్థంగా టీనేజర్ల వలే ప్రవర్తిస్తారన్న అర్థం కాదని పరిశోధకులు స్పష్టంచేశారు. 32 ఏళ్ల తర్వాత మెదడు నిర్మాణం స్థిరపడుతూ, వ్యక్తిత్వం, తెలివితేటలు కూడా ఒక స్థాయిలో నిలబడతాయని, మెదడు విభజనలు (compartmentalization) మరింత స్పష్టమవుతాయని చెప్పారు. చివరిలో కనిపించే రెండు మలుపులు వృద్ధాప్య కారణంగా మెదడులో కనెక్టివిటీ తగ్గిపోవడం, వైట్ మ్యాటర్ తగ్గుదల వల్ల వచ్చే మార్పులతో సంబంధం ఉన్నవని పరిశోధకుల అభిప్రాయం.

Advertisement