LOADING...
WhatsApp: వాట్సప్‌ చాట్‌లను మెటా చదవగలదా?.. నష్టపరిహారం కోరిన యూజర్లు!
వాట్సప్‌ చాట్‌లను మెటా చదవగలదా?.. నష్టపరిహారం కోరిన యూజర్లు!

WhatsApp: వాట్సప్‌ చాట్‌లను మెటా చదవగలదా?.. నష్టపరిహారం కోరిన యూజర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్ల డేటా ఎక్కడా లీక్ కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇటీవల గోప్యత విషయంలో అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం యూఎస్ కోర్టును ఆశ్రయించింది. దావాలో పేర్కొనబడిన వివరాల ప్రకారం వాట్సప్ మాతృ సంస్థ 'మెటా'(Meta), యూజర్ల ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్(end-to-end encryption)సందేశాలను చదవగలదని పేర్కొన్నప్పటికీ, నిజానికి మెటా ఉద్యోగులకు ప్రైవేట్ సందేశాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని వినియోగదారులు ఆరోపించారు. వివరాల్లో మెటా ఇంజినీర్ బృందానికి 'టాస్క్' అనే సందేశం పంపగానే, యూజర్ల ఐడీ ద్వారా సందేశాలను పరిశీలించడానికి సంస్థకు యాక్సెస్ ఇచ్చేలా ఉందని అంతర్జాతీయ వినియోగదారుల బృందం పేర్కొంది.

Details

అమెరికా, శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలు

వారు యూజర్ల సందేశాలను ఎందుకు చూడాలనుకుంటున్నారో కూడా మెటా పరిశీలించినట్లు వాదించారు. ఈ కేసు అమెరికా, శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలు చేయబడింది. దావాదారులు తమను మోసం చేసినందుకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఏ ఆధారాలు సమర్పించలేదు. తనవైపు మెటా కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది. వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నందున, సందేశాలను పంపేవారు, అందుకునేవే మాత్రమే చదవగలరని వెల్లడించింది. ఎన్‌క్రిప్షన్ కీలు యూజర్ల పరికరాల్లోనే ఉంచబడతాయి. కాబట్టి వాటిని డీక్రిప్ట్‌ చేయడం సాధ్యం కాదు. వినియోగదారుల గోప్యతను పరిరక్షించేందుకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ రూపొందించినట్లు మెటా స్పష్టం చేసింది.

Advertisement