Page Loader
iPhone: ఆపిల్‌కు వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు.. ఐఫోన్లలో సమస్య
ఆపిల్‌కు వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు.. ఐఫోన్లలో సమస్య

iPhone: ఆపిల్‌కు వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు.. ఐఫోన్లలో సమస్య

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ టెక్‌ సంస్థ ఆపిల్‌ (iPhone) ప్రతికూల పరిణామాన్ని ఎదుర్కొంటోంది. ఐఫోన్‌లలోని ఐఓఎస్‌ 18+ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో ఉన్న లోపాలపై వినియోగదారులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రహ్లాద్ జోషి చేసిన ట్వీట్ 

వివరాలు 

ఆపిల్ సమగ్ర వివరణ ఇవ్వాలన్నమంత్రి 

తమ ఐఫోన్‌లలో ఐఓఎస్‌ 18+ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ తర్వాత సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీసీపీఏ చర్య తీసుకుని, సంబంధిత నోటీసులను పంపించినట్లు మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ తర్వాత ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలపై ఆపిల్ సమగ్ర వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు.