కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఉపయోగించే 14 యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రవాదుల కమ్యూనికేషన్ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇండియాలో 14 యాప్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా ఇప్పటికే ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. లేదంటే భవిష్యతులో ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి రావొచ్చు. కేంద్రం నిషేధించిన 14 యాప్స్ లో అన్ని మెసెంజర్ యాప్సే ఉండడం విశేషం. భద్రతా కారాణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
బ్యాన్ చేసిన యాప్స్ ఇవే..
జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్ అప్లికేషన్లపై కేంద్ర కొన్నాళ్లు గా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర బ్యాన్ చేసిన వాటిలో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌వైజ్, వికర్‌మి, బ్రియార్, బీఛాట్, నాండ్‌బాక్స్, కొనియాన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగీ, త్రిమా ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా టెర్రరిస్ట్‌లు వారి మద్దుతుదారులకు మెసేజ్‌లు పంపిస్తున్నారని నివేదికలు రావడంతో వెంటనే కేంద్రం అలర్ట్ అయింది. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం 250 చైనా యాప్స్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.