LOADING...
చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌
విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌

చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 17, 2023
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. ఈ మేరకు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విజయంవంతంగా విడిపోయినట్లు ఇస్రో ప్రకటించింది. చందమామపై పాదంమోపడమే లక్ష్యంగా నింగిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 గురువారం ఈ కీలక మైలురాయిని అందుకుంది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగే కీలక ఘట్టం పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్ స్వతంత్రంగా చంద్రుడిని చుట్టేయనుంది. చంద్రయాన్‌-3ని జులై 14న LVM3-M4 రాకెట్‌ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. చంద్రయాన్‌-3 చివరి దశ కక్ష్యలోకి బుధవారం ప్రవేశించింది. త్వరలోనే ఈనెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 విజయవంతంగా విడిపోయిన ల్యాండర్ విక్రమ్‌