
WhatsApp: వాట్సాప్‌లో చాట్‌బాట్‌లకు నిషేధం.. ఆ రోజు నుంచే అమలు!
ఈ వార్తాకథనం ఏంటి
Meta యాజమాన్యంలో ఉన్న మేసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ తన బిజినెస్ API పాలసీలో కీలక మార్పులు చేసినట్లు ప్రకటించింది. వాట్సాప్‌లో సాధారణ చాట్‌బాట్లను ఉపయోగించడాన్నినిషేధించింది. ఈ నిబంధన OpenAI, Perplexity వంటి కొన్ని కంపెనీల AI అసిస్టెంట్‌లపై ప్రభావం చూపనుంది. ఈ కొత్త పాలసీ 2026 జనవరి 15 నుంచి అమలులోకి రాబోతుంది. ఇంకా పాలసీలో కొత్తగా ఏఐ ప్రొవైడర్లు అనే సెక్షన్‌ను చేర్చారు. ఇది ప్రధానంగా సాధారణ చాట్‌బాట్లను లక్ష్యంగా చేసుకుంది. Meta తెలిపిన వివరాల ప్రకారం, AI మోడల్ ప్రొవైడర్లు వాట్సాప్‌లో తమ AI అసిస్టెంట్‌లను ఉపయోగించరాదు. అయితే కస్టమర్ సపోర్ట్ కోసం AIను ఉపయోగిస్తున్న వ్యాపారాలను ఇది ప్రభావితం చేయదు.
Details
రెవెన్యూ ప్రభావం
వాట్సాప్ బిజినెస్ ఏపీఐ వ్యాపారాలకు కస్టమర్ సపోర్ట్ అందించడానికి, అవసరమైన అప్‌డేట్లు పంపడానికి రూపొందించినట్లు మెటా తెలిపింది. ఈ నూతన ఉపయోగం ద్వారా మెసేజ్ వాల్యూమ్ పెరిగింది. వాట్సాప్ వివిధ మెసేజ్ టెంప్లేట్ల (మార్కెటింగ్, యుటిలిటీ, ఆథెంటికేషన్, సపోర్ట్) ఆధారంగా వ్యాపారాల నుండి చార్జ్ చేస్తుంది. అయితే చాట్‌బాట్ల కోసం ఏ విధమైన చార్జింగ్ ప్రావిజన్ లేదు కాబట్టి, మెటా వాటిపై ఆదాయం పొందలేకపోయింది. 2025 Q1 ఎర్నింగ్స్ కాల్‌లో సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ బిజినెస్ మెసేజింగ్ మా తదుపరి వ్యాపార నిలువుగా ఉండాలని పేర్కొన్నారు.