ChatGPT: AIతో క్షణాల్లో PPT.. కొత్త సదుపాయం తెచ్చిన OpenAI
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ సేవలను ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ తో అనుసంధానం చేసింది. దీంతో యూజర్లు AIసహాయంతో కొత్త ప్రెజెంటేషన్ స్లైడ్లు తయారు చేసుకోవడంతో పాటు పాతస్లైడ్లను కూడా సులభంగా ఎడిట్ చేసుకునే అవకాశం లభించనుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. సాధారణ కమాండ్‌తోనే ప్రెజెంటేషన్ సిద్ధం కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు సింపుల్‌గా టైప్ చేసిన సూచనలను చాట్‌జీపీటీ అర్థం చేసుకుని ఆటోమేటిక్‌గా ప్రెజెంటేషన్ రూపొందిస్తుంది. అలాగే ఇప్పటికే ఉన్న స్లైడ్లలో టెక్స్ట్ మార్పులు చేయడం,కొత్త సమాచారం జోడించడం వంటి పనులను కూడా AI చేయగలదు. దీంతో ఆఫీస్ పనులు,చదువుకు సంబంధించిన ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
వివరాలు
Gmail, Outlook డేటాతో కూడా పని
కంపెనీ ప్రకారం ChatGPT, Gmail, Microsoft Outlook, Microsoft SharePoint వంటి సేవల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుని కూడా ప్రెజెంటేషన్ తయారీలో సహాయపడుతుంది. దీంతో వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి డేటాను కాపీ చేయాల్సిన అవసరం తగ్గి, సమయం ఆదా అవుతుంది. ఫ్రీ యూజర్లకూ అవకాశం ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా మోడ్‌లో ఉన్నప్పటికీ, ఫ్రీ ప్లాన్ వాడుతున్న యూజర్లు అలాగే ChatGPT బిజినెస్ యూజర్లు కూడా దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపింది. AI సహాయంతో స్లైడ్ డిజైన్, కంటెంట్ తయారీ మరింత సులభం అవుతుందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
AI కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ
Anthropic ఇప్పటికే తన Claude చాట్‌బాట్‌లో ఇలాంటి ఫీచర్‌ను అందిస్తోంది. మరోవైపు Google యొక్క Gemini ఇప్పటికే Google Slidesతో పనిచేస్తోంది. ఇప్పుడు OpenAI కూడా పవర్‌పాయింట్ సపోర్ట్ తీసుకురావడంతో AI టూల్స్ మధ్య పోటీ మరింత పెరిగింది. ఇప్పటికే కంపెనీ ఎక్సెల్, గూగుల్ షీట్స్ వంటి ఎంటర్‌ప్రైజ్ టూల్స్‌లో కూడా ChatGPT వినియోగాన్ని విస్తరిస్తోంది.