LOADING...
ChatGPT: చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ వచ్చేసింది: ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
ఇది ఒక సంభాషణలో AIతో 20 మంది వరకు సహకరించడానికి అనుమతిస్తుంది

ChatGPT: చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ వచ్చేసింది: ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ తాజాగా చాట్‌జీపీటీ గ్రూప్ చాట్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఒకే సంభాషణలో గరిష్టంగా 20 మంది వరకు కలిసి చాట్‌జీపీటీతో పనిచేసే అవకాశం కలుగుతుంది. జపాన్, న్యూజిలాండ్‌లలో ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, ఈ ఫీచర్‌ను ఇప్పుడు Free, Go, Plus, Pro ప్లాన్‌ల్లో ఉన్న అందరికీ రిలీజ్ చేశారు.

యూజర్ గైడ్  

గ్రూప్ చాట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి 

గ్రూప్ చాట్ ప్రారంభించాలంటే, యూజర్లు "పీపుల్" ఐకాన్‌పై ట్యాప్ చేసి, పాల్గొనేవారిని మాన్యువల్‌గా యాడ్‌ చేయవచ్చు లేదా ఒక షేర్ లింక్ ద్వారా ఆహ్వానించవచ్చు. ప్రతి వ్యక్తి తమ పేరు, యూజర్‌నేమ్, ఫోటోతో చిన్న ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక ప్రస్తుత చాట్‌లో ఎవరినైనా యాడ్ చేస్తే, అది కొత్త సంభాషణను క్రియేట్ చేస్తుంది, కానీ అసలైన చాట్ అలాగే కొనసాగుతుంది.

AI ప్రమేయం 

గ్రూప్ సంభాషణలలో ChatGPT పాత్ర 

గ్రూప్ చాట్స్‌లో చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుందో కూడా ఓపెన్‌ఏఐ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలనే విషయాన్ని AI‌ స్వయంగా గుర్తిస్తుంది. అవసరమైతే యూజర్లు "ChatGPT"ని ట్యాగ్ చేస్తే, అది వెంటనే రిప్లై ఇస్తుంది. ఎమోజీలతో రియాక్ట్ అవడం, ప్రొఫైల్ ఫోటోల్ని రిఫర్ చేయడం వంటి ఫీచర్లు ఇంటరాక్షన్‌ను మరింత లైవ్లీగా మారుస్తాయి. అయితే ప్రతి యూజర్‌ వ్యక్తిగత సెట్టింగ్స్, మెమరీ మాత్రం ప్రైవేట్‌గానే ఉంటాయి.

భవిష్యత్తు ప్రణాళికలు 

గ్రూప్ చాట్‌లు: సహకార AI వైపు ఒక అడుగు 

మొత్తంగా, గ్రూప్ చాట్స్ ఫీచర్ చాట్‌జీపీటీని మరింత కలసి పనిచేసే ప్లాట్‌ఫారమ్‌గా మార్చే దిశలో ఒక కీలక అడుగుగా ఓపెన్‌ఏఐ చూస్తోంది. భవిష్యత్తులో నిజమైన గ్రూప్ సంభాషణల్లో ప్లానింగ్, క్రియేషన్, యాక్షన్ వంటి వాటిలో చాట్‌జీపీటీ యాక్టివ్ పాత్ర పోషించాలన్నది కంపెనీ లక్ష్యం. ఇదంతా GPT-5.1ని Instant, Thinking వెర్షన్‌లతో రిలీజ్ చేసిన కొన్ని వారాలకే రావడం కూడా చర్చనీయాంశం అయింది.