LOADING...
ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. వారానికి 700 మిలియన్ల యూజర్లు! 
చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. వారానికి 700 మిలియన్ల యూజర్లు!

ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. వారానికి 700 మిలియన్ల యూజర్లు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీ విపరీతమైన ప్రజాదరణ పొందింది! ఈ వారానికి 700 మిలియన్ల యాక్టివ్ యూజర్ల మార్క్‌ను తాకబోతోంది. మార్చిలో ఇది 500 మిలియన్ల వద్ద ఉండగా, ఏడాదిలో నాలుగు రెట్లు వృద్ధి సాధించిందని సోమవారం కంపెనీ వెల్లడించింది. ఈ గణాంకాల్లో చాట్‌జీపీటీని వాడే అన్ని కేటగిరీలు ఉన్నాయి. ఉచితం, ప్లస్ ప్రో, ఎంటర్‌ప్రైజ్‌, టీమ్‌, ఎడ్యూ వర్షన్లు అన్నీ ఉన్నాయి. రోజుకి మూడు బిలియన్లకు పైగా మెసేజ్‌లు చాట్‌జీపీటీకి వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.5 రెట్ల నుంచి 4 రెట్లు పెరిగినట్టు చెప్పొచ్చు.

వివరాలు 

 కంపెనీ ఐదు మిలియన్ల పేయింగ్ బిజినెస్ యూజర్లు 

"ప్రతి రోజు వ్యక్తులు,టీంలు కొత్తగా నేర్చుకుంటున్నారు,సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు,కష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నారు"అని చాట్‌జీపీటీ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ నిక్ టర్లే అన్నారు. ఇక కంపెనీ ప్రస్తుతం ఐదు మిలియన్ల పేయింగ్ బిజినెస్ యూజర్లను కలిగి ఉంది. ఇది జూన్‌లో ఉన్న మూడు మిలియన్ల నుంచి రెట్టింపు అయ్యింది. కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు ఎక్కువగా చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నాయి. అయితే, గూగుల్‌ 'ఏఐ ఓవర్ వ్యూస్' లాంటి ప్రాడక్ట్‌ గణాంకాలతో పోలిస్తే ఇంకా చాల దూరం ఉంది. గూగుల్ CEO సుందర్ పిచై ప్రకారం, ఈ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా 200కిపైగా దేశాల్లో నెలకు 2 బిలియన్ల మందికిపైగా వాడుతున్నారు. అలాగే గూగుల్ జెమినీ యాప్‌కు కూడా 450 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

వివరాలు 

ఓపెన్‌ఏఐ వార్షిక రికరింగ్ రెవెన్యూ $13 బిలియన్లకు..

ఓపెన్‌ఏఐ ఈ వృద్ధిని నడిపిస్తున్న సమయంలోనే ఇటీవలే పెద్ద పెట్టుబడిని కూడగట్టింది. Dragoneer, Andreessen Horowitz, Sequoia Capital, Coatue, Altimeter లాంటి దిగ్గజ ఇన్వెస్టర్ల నుంచి $8.3 బిలియన్ పెట్టుబడి లభించింది. ఇది సోఫ్ట్‌బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న $40 బిలియన్ రౌండ్‌లో భాగం.ఈ రౌండ్ అంచనా కన్నా ముందుగానే పూర్తయ్యింది, అది ఐదు రెట్లు ఓవర్‌సబ్స్క్రైబ్ అయిందట! ఇప్పుడు ఓపెన్‌ఏఐ వార్షిక రికరింగ్ రెవెన్యూ $13 బిలియన్లకు చేరింది. జూన్‌లో ఇది $10 బిలియన్ కాగా, 2025 చివరికల్లా ఇది $20 బిలియన్ దాటి పోయే అవకాశముంది. ఇంత ఆదాయం ఉన్నా, ఓపెన్‌ఏఐకి గ్లోబల్ ప్రొజెక్టుల కోసం ఇంకా భారీ పెట్టుబడుల అవసరం ఉంది.

వివరాలు 

ఓరాకిల్‌తో ఏడాదికి $30 బిలియన్ల విలువైన 4.5 గిగావాట్ల డాటా సెంటర్‌ల లీజ్ ఒప్పందం 

సాఫ్ట్‌బ్యాంక్‌,ఓరాకిల్‌,MGXతో కలిసి "స్టార్గేట్" పేరిట ఓ భారీ భాగస్వామ్యం ఏర్పాటు చేయగా,నాలుగు సంవత్సరాల్లో $500 బిలియన్ల విలువైన AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓరాకిల్‌తో ఏడాదికి $30 బిలియన్ల విలువైన 4.5 గిగావాట్ల డాటా సెంటర్‌ల లీజ్ ఒప్పందాన్ని చేసుకుంది. అలాగే CoreWeave అనే కంపెనీతో ఐదేళ్లలో $11.9 బిలియన్ల డీల్ కూడా కుదుర్చుకుంది. స్టార్గేట్ నార్వే ద్వారా యూరప్‌లో విస్తరిస్తోంది. ఇక UAEలోని G42 సంస్థతో కలిసి అబుదాబీలో భారీ డాటా సెంటర్ నిర్మాణం చేపడుతోంది. ఓపెన్‌ఏఐ పోటీదారులు కూడా ఊహించని రీతిలో ముందుకు వెళ్తున్నారు.

వివరాలు 

AI పోటీ యుద్ధంలో గెలవడానికి కంపెనీలు..

Anthropic సంస్థ CEO డారియో అమొడీ,గతంలో మధ్యప్రాచ్యం నుంచి ఫండింగ్ తీసుకోనని చెప్పినప్పటికీ, తాజా లీకైన మెమో ప్రకారం గల్ఫ్ వెల్త్ ఫండ్లను ఉపయోగించకుండా AI అభివృద్ధిలో ముందుండటం కష్టమవుతోందని పేర్కొన్నారు. ఇది వారి మునుపటి విధానానికి భిన్నంగా ఉంది.గతేడాది Anthropic,సౌదీ అరేబియా ఫండింగ్‌ను తిరస్కరించినట్టు CNBC తెలిపింది. కానీ ఇప్పుడు మళ్లీ వారు $170బిలియన్ విలువతో $5బిలియన్ రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన $3.5బిలియన్ రౌండ్‌లో కంపెనీ విలువ $61.5 బిలియన్లు ఉన్నట్టు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే... చాట్‌జీపీటీ వాడకం రెట్టింపు అవుతుండగా, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. AI పోటీ యుద్ధంలో గెలవడానికి కంపెనీలు నిధులు, నెట్‌వర్క్‌లు, డాటా సెంటర్లు అన్నింటినీ విస్తరిస్తున్నాయి.