Page Loader
చాట్‌జీపీటీతో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే టెడ్డీస్
చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే టెడ్డీస్

చాట్‌జీపీటీతో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే టెడ్డీస్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 21, 2023
07:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)తో ప‌లు రంగాల్లో ఊహించని రీతిలో మార్పులు వస్తున్నాయి. సమీప భ‌విష్య‌త్‌లో చిన్నారులకు కోరుకున్న కథలు చెప్పే చాట్‌జీపీటీ ఆధారిత టెడ్డీ బియర్స్ ( స్మార్ట్ టాయ్స్ ) వచ్చేస్తున్నాయి. పిల్ల‌ల‌తో మాట్లాడగలిగే స్మార్ట్ టాయ్స్ మార్కెట్లను టెక్నాలజీతో హోరెత్తిస్తున్నాయి. చిన్నారులతో ముచ్చటించేందుకు స్మార్ట్ టాయ్‌లు ఏఐని వాడ‌నున్నాయి. ఏఐ ఆధారిత టాయ్‌లు పిల్ల‌ల‌కు రాత్రి పూట నిద్రించే ముందు బెడ్‌టైమ్ స్టోరీస్ చెప్పనున్నట్లు వీటెక్ హోల్డింగ్స్ సీఈవో అల‌న్ వాంగ్ వెల్లడించారు. మ‌నుషుల లాగానే ఏఐ చాట్‌బాట్ స్పందిస్తుండటం కారణంగా చాలా టాస్క్‌ల‌కు దీన్నే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీకి మంచి ఆద‌ర‌ణ వచ్చింది. గూగుల్ బార్డ్‌, మైక్రోసాఫ్ట్ బింగ్ అనే చాట్‌బాట్స్‌ ప్రారంభమయ్యాయి.

DETAILS

చిన్నారులకు ఏఐ టెక్నిక్స్ తో టెడ్డీ బీయర్ స్టోరీస్

కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతో పిల్ల‌లు ఏఐ చాట్‌బాట్‌తో కనెక్ట్ కానున్నట్లు ఎల‌క్ట్రానిక్ టాయ్ మేక‌ర్ వీటెక్ హోల్డింగ్స్ వ్య‌వ‌స్ధాప‌కులు వాంగ్ వివరించారు. 2028 నాటికి చాట్‌జీపీటీ లాంటి సాంకేతికతను బొమ్మ‌ల ప‌రిశ్ర‌మ అందిపుచ్చుకుంటుందన్నారు. అంతేకాకుండా పిల్ల‌ల‌తో మాట్లాడే స్మార్ట్ టాయ్‌ల‌ను త‌యారు చేసేందుకు ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. చిన్నారులకు పుస్తకాల నుంచి మొదలు, మరెన్నో అంశాల్లో ప్ర‌త్యామ్నాయంగా టెడ్డీ బియర్స్ లో ఏఐని ఉపయోగిస్తామన్నారు. పిల్ల‌ల‌కు కథలను వినిపించ‌డ‌ం ఒక్కటే కాకుండా ఏఐ ఆధారిత టాయ్స్ తో వారి మనసుకు అనుగుణంగా కోరుకున్న అన్ని కథలను అందించే నైపుణ్యం ఈ టాయ్స్ సొంతమన్నారు.