China: 100Gbps లేజర్ టెక్‌తో 6G రేస్‌లో స్టార్‌లింక్‌ను ఓడించిన చైనా..!
ఈ వార్తాకథనం ఏంటి
చైనా డేటా ప్రసారం చేసే సాంకేతికతలో కీలకమైన ముందడుగు వేసింది.
చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ అనే సంస్థ సెకనుకు 100 గిగాబిట్స్ వేగంతో డేటాను ట్రాన్స్‌మిట్ చేయగల అత్యాధునిక హైరిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
ఈ ప్రయోగంలో జిలిన్-1 ఉపగ్రహం నుంచి ట్రక్‌పై ఏర్పాటు చేసిన గ్రౌండ్ స్టేషన్‌కు డేటాను ప్రసారం చేశారు. ఇది గత రికార్డుతో పోలిస్తే 10 రెట్లు వేగంగా ఉండటం విశేషం.
ఈ టెక్నాలజీ గురించి లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్స్ అధిపతి వాంగ్ హాంగ్‌హాంగ్ మాట్లాడుతూ, స్టార్‌లింక్ 6జీ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నదన్న వార్తలు అధికారికంగా నిర్ధారించబడలేదని చెప్పారు.
వివరాలు
100 జీబీపీఎస్ డేటా అంటే సుమారు 10 పూర్తి స్థాయి సినిమాల సైజుకు సమానం
కానీ, ఈ సాంకేతికతలో తమ సంస్థ మస్క్ కంపెనీని దాటిపోయిందని వివరించారు.
"స్టార్‌లింక్ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. అయితే, వారు ఇంకా శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ కోసం దానిని ఉపయోగించలేదు. వారి వద్ద టెక్నాలజీ ఉండవచ్చు, కానీ మేము ఇప్పటికే దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాం" అని తెలిపారు.
ఈ సంస్థ 2027 నాటికి జిలిన్-1 శ్రేణిలోని ఉపగ్రహాలను పూర్తి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
100 జీబీపీఎస్ డేటా అంటే సుమారు 10 పూర్తి స్థాయి సినిమాల సైజుకు సమానం.
దీన్ని చైనా సంస్థ కేవలం ఒక సెకనులో ప్రసారం చేయగలిగింది.
ఇదే గరిష్ట వేగాన్ని గతంలో మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,నాసా టెరాబైట్ ఇన్ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్స్ సాధించాయి.
వివరాలు
5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసిన చైనా
ప్రపంచ వ్యాప్తంగా 5జీ కమ్యూనికేషన్ ప్రస్తుతం ప్రధానంగా వాడుకలో ఉంది. అయితే, 6జీ దాని ఆధునిక వెర్షన్‌గా వస్తోంది.
ఇది అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగిస్తుంది. చైనా తాజాగా 5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది.
ఇది యుద్ధ వాతావరణంలో కూడా మూడు కిలోమీటర్ల పరిధిలో 10,000 మందికి అత్యంత సురక్షితంగా మరియు వేగవంతంగా డేటాను ప్రసారం చేయగలదు.
ఈ స్టేషన్‌ను చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్ మరియు ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.