China Launched Shenzhou-19: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్ర.. ఆరు నెలల తర్వాత చైనా ప్రవేశం
చైనా తన అంతరిక్ష యాత్ర షెంజో-19ని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ కింద, చైనా తన అంతరిక్ష కేంద్రానికి ఆరు నెలలపాటు ముగ్గురు వ్యోమగాములను పంపింది. ఈ మిషన్‌లో చైనాకు చెందిన తొలి మహిళా స్పేస్ ఇంజనీర్ పాల్గొంది. వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ఈ మిషన్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 4:27 గంటలకు ప్రారంభమైంది. ప్రయోగం ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత, షెంజో-19 అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి తన నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (CMSA) వ్యోమగాములందరూ క్షేమంగా ఉన్నారని, ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైందని స్పష్టం చేసింది.
కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం
ఈ మిషన్‌లో మిషన్ కమాండర్ కై జుజే, వ్యోమగాములు సాంగ్ లింగ్‌డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుజే అనుభవజ్ఞుడైన వ్యోమగామిగా 2022లో జరిగిన షెన్‌జౌ-14 మిషన్‌లో కూడా పాల్గొన్నారు. 1990లలో జన్మించిన సాంగ్, వాంగ్, చైనా వ్యోమగాముల మూడవ బ్యాచ్‌లో భాగంగా ఉన్నారు. వాంగ్ చైనా సంబంధించి ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్ గా గుర్తింపుపొందారు. ఆమె మూడో చైనా మహిళగా అంతరిక్ష యాత్రలో చేరారు. ఈ మిషన్‌లో వ్యోమగాములు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
86 స్పేస్ సైన్స్ రీసెర్చ్ టెక్నాలజీ ప్రయోగాలు
అందులో అంతరిక్ష శాస్త్రం, అప్లికేషన్ పరీక్షలు, రక్షణ పరికరాల ఇన్‌స్టాలేషన్, అదనపు వాహన పేలోడ్‌లు, పరికరాల ఇన్‌స్టాలేషన్ వంటి వాటి నిర్వహణ ఉంటుంది. స్పేస్ లైఫ్ సైన్స్, మైక్రోగ్రావిటీ ఫండమెంటల్ ఫిజిక్స్, స్పేస్ మెటీరియల్స్ సైన్స్, స్పేస్ మెడిసిన్, కొత్త స్పేస్ టెక్నాలజీలు వంటి అనేక రంగాల్లో 86 స్పేస్ సైన్స్ రీసెర్చ్ టెక్నాలజీ ప్రయోగాలను నిర్వహించనున్నారని CMSA ప్రతినిధి లిన్ జికియాంగ్ చెప్పారు.