Page Loader
షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా 
షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా

షెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా 

వ్రాసిన వారు Stalin
May 30, 2023
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష ప్రయోగంలో చైనా మరో మైలు రాయిని చేరుకుంది. ముగ్గురు వ్యోమగాములతో కూడిన షెన్‌జౌ-16 అంతరిక్ష నౌకను లాంగ్ మార్చ్ 2ఎఫ్ రాకెట్ సాయంతో చైనా తమ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు మంగళవారం విజయవంతంగా పంపింది. షెన్‌జౌ-16 అంతరిక్ష నౌక ప్రయోగం ద్వారా చైనా తొలిసారిగా తొలి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపింది. ఇప్పటివరకు, అంతరిక్ష యాత్రలు చేసిన చైనా వ్యోమగాములందరూ దేశ సాయుధ దళాలలో భాగంగా ఉన్నారు. ఆర్మీకి సంబంధం లేని ఒక వ్యక్తిని చైనా అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో ప్రొఫెసర్ అయిన గుయ్ హైచావోను చైనా ఈ మిషన్‌లో భాగం చేసింది.

చైనా

చంద్రునిపై స్థావరాన్ని నిర్మించే ఆలోచనలో చైనా 

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మంగళవారం తెల్లవారుజామున 'షెన్‌జౌ-16'ను ప్రయోగించారు. ప్రయోగించిన 6.5 గంటల తర్వాత షెన్‌జౌ -16 అంతరక్ష నౌకలోని సిబ్బంది చైనా స్పేస్ సెంటర్ టియాంగాంగ్‌కు చేరుకోనున్నారు. చంద్రునిపై 3డి ప్రింటింగ్‌ను పరీక్షించడంతోపాటు భవిష్యత్తు పరిశోధనల కోసం చైనా ప్రస్తుత ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రునిపై చైనా స్థావరాన్ని నిర్మించాలని చైనా యోచిస్తోంది. 2029 నాటికి చంద్ర మిషన్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ దేశ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.