తొలిసారిగా అంతరిక్షంలోకి పౌరుడు.. రేపు నింగిలోకి పంపనున్న చైనా
చైనా తొలిసారిగా తమ దేశ సాధారణ పౌరుడిని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్‌లో భాగంగా మంగళవారమే తమ దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపనుందని ఆ దేశ మానవ సహిత అంతరిక్ష సంస్థ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీచింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రోఫెసర్, పేలోడ్ నిపుణుడు గుయ్ హైచావో, మానవ సహిత అంతరిక్ష సంస్థ ప్రతినిధి లిన్ జియాంగ్ వెల్లడించారు. బీజింగ్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ప్రోఫెసర్ గా పనిచేసే నిపుణు గుయ్ హైచావ్ ను పంపేందుకు చైనా ఏర్పాట్లను చేసింది. చైనా అంతరిక్షంలోకి పంపిన వారు మొత్తం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే.
భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులకు పంపేందుకు ప్రణాళికలు
ఈ మిషన్ వాయువ్య చైనాలోని జ్యూకాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు ప్రారంభం కానుందని స్సేస్ ఏజెన్సీ ధ్రువీకరిచింది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రణాళిక అయిన స్పేస్ డ్రీమ్ ను మరింత ముందుకు తీసుకెళ్లడంతో భాగంగా ఈ యాత్ర జరగుతోంది. ఇప్పటికే సైనిక అంతరిక్ష కార్యక్రమంలో చైనా బిలియన్ల కొద్ది డాలర్లను పెట్టుబడులు పెట్టింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను తరలించడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అంతరిక్ష పరిశోధనలో అమెరికా, రష్యాల సరసన చేరేందుకు ఉవ్విళ్లూరుతోంది.