English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్-3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో చైర్మన్
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్-3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో చైర్మన్
    ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్

    చంద్రయాన్-3 గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో చైర్మన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనతను సాధించింది. నేడు ఉదయం 10.42 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎన్‌వీఎస్-01ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

    ఈ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ చంద్రయాన్ 3 గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.

    చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి చంద్రయాన్ 3ని జులైలో ప్రయోగించబోతోతున్నట్లు స్పష్టం చేశారు. జులై 12వ తేదీన ఈ స్పేష్ క్రాప్ట్ ను ప్రయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

    చంద్రయాన్-3 స్పేస్ క్రాప్ట్‌లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవల్ మాడ్యూల్ ఉండనున్నాయి. ఇప్పటికే ఇస్రో రెండుసార్లు చంద్రుడిపై వ్యోమనౌకలను పంపిన విషయం తెలిసిందే.

    Details

    శ్రీహరి కోటకు చేరుకున్న మూన్ లైట్

    గతంలో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైంది. ఈ నేపథ్యంలో ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టలేకపోయింది. చివరి నిమిషంలో గతి తప్పింది.

    2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ సంకేతాలు పూర్తిగా స్తంభించిపోవడంతో అది క్యాష్ ల్యాండ్ అయింది.

    బెంగళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపుదిద్దుకున్న మూన్ శాటిలైట్ ఇప్పటికే శ్రీహరి కోటకు చేరుకుంది. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో చంద్రయాన్-3 ను తీసుకెళ్లే ఎల్‌వీఎం రాకెట్ ను రూపొందిస్తున్నారు.

    ఈ స్పేస్ క్రాప్ట్ మరో మూడు వారాల్లో మూన్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో
    పరిశోధన

    తాజా

    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌
    IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ? బీసీసీఐ

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ భారతదేశం
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    పరిశోధన

    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో ఇస్రో
    కొత్త రాకెట్ SSLV-D2 ను ప్రయోగించనున్నఇస్రో ఇస్రో
    సూర్యుని నుండి భారీ ముక్క విరగడంతో ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు సూర్యుడు
    నాసాకు చెందిన రోవర్ మిషన్ నిర్మించిన శాంపిల్ డిపో గురించి తెలుసుకుందాం నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025