Page Loader
Lijian-1 Rocket: క‌క్ష్య‌లోకి 5 శాటిలైట్ల‌ను పంపిన చైనా రాకెట్ లిజియ‌న్-1 
క‌క్ష్య‌లోకి 5 శాటిలైట్ల‌ను పంపిన చైనా రాకెట్ లిజియ‌న్-1

Lijian-1 Rocket: క‌క్ష్య‌లోకి 5 శాటిలైట్ల‌ను పంపిన చైనా రాకెట్ లిజియ‌న్-1 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా తన వాణిజ్య రాకెట్ లిజియాన్-1ను(Lijian-1 Rocket)ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా అయిదు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించినట్టు సమాచారం.లిజియాన్-1 రాకెట్‌ను చైనీస్ ఏరోస్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కోర్ (CAS) అభివృద్ధి చేసింది.ఈ పరీక్ష శుక్రవారం ఉదయం 7:33 నిమిషాలకు జిక్వాన్ ఉపగ్రహాల లాంచ్ సెంటర్ నుండి ప్రారంభమైంది. పంపించిన అయిదు ఉపగ్రహాల్లో రెండు ఎయిర్‌శాట్ కంపెనీకి చెందినవి. జిలిన్-1 ఎస్ఏఆర్01ఏ, యున్యావో-1 శాటిలైట్లను భూమి సర్వే,వాతావరణ అధ్యయనాల కోసం ఉపయోగించబోతున్నారు. చైనా ఈ తరహా రాకెట్లను ప్రయోగించడం ఇది నాలుగవ సారి.2022 జూలైలో మొదటి లిజియాన్ రాకెట్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు ఈ రాకెట్ల ద్వారా 42 శాటిలైట్లను పంపించగా,4 టన్నుల బరువైన పేలోడ్లను కూడా తీసుకెళ్లారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చైనా రాకెట్ లిజియ‌న్-1