Panspermia: భూమి నుంచి శుక్రగ్రహానికి జీవరాశులు వెళ్లాయా?.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..
ఈ వార్తాకథనం ఏంటి
శుక్రగ్రహం వాతావరణంలో ఎప్పుడైనా జీవరాశులు కనుగొంటే, అవి భూమి నుంచే చేరి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 'పాన్స్‌పెర్మియా'(Panspermia) అనే సిద్ధాంతం ప్రకారం, భూమి పైభాగంలోని సూక్ష్మజీవులు గ్రహశకలాల ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి వెళ్లి, చివరికి శుక్రగ్రహం మేఘాల్లో చేరి ఉండవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. 2026లో జరిగిన లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సుమారు 70 కోట్ల నుంచి 75 కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి పెద్ద ఎత్తున పదార్థం అంతరిక్షంలోకి వెళ్లి, శుక్రగ్రహానికి చేరి ఉండవచ్చని అంచనా.
వివరాలు
సూక్ష్మజీవాలు ఉండే అవకాశం
శుక్రగ్రహం ఉపరితలం చాలా వేడిగా ఉండి సీసం కరిగే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ 45 నుంచి 60 కిలోమీటర్ల ఎత్తులోని మేఘాల్లో మాత్రం కొంత మితమైన వాతావరణం ఉంటుంది. అక్కడ సూక్ష్మజీవాలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మేఘాల్లో కనిపించే రసాయన అసమతుల్యతలు, అర్థంకాని అల్ట్రావయొలెట్ కిరణాల శోషణ వంటి అంశాలు జీవం ఉన్న సూచనలుగా చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు శుక్రగ్రహంలో జీవం ఉందని నిర్ధారణ కాలేదు. అక్కడ జీవం ఉంటే,అది తీవ్రమైన ఆమ్ల వాతావరణాన్ని తట్టుకునే విధంగా చాలా బలంగా ఉండాల్సి ఉంటుంది. మరోవైపు, శుక్రగ్రహం గతంలో సముద్రాలు ఉన్న కాలంలోనే జీవం ఉద్భవించి, తరువాత వాతావరణ మార్పులకు అనుగుణంగా మేఘాల్లో కొనసాగి ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.