LOADING...
DeepMind CEO Demis: మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేదానికంటే..అదే డేంజర్ : డీప్‌ మైండ్‌ సీఈఓ 
మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేదానికంటే..అదే డేంజర్ : డీప్‌ మైండ్‌ సీఈఓ

DeepMind CEO Demis: మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసేదానికంటే..అదే డేంజర్ : డీప్‌ మైండ్‌ సీఈఓ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతి రంగాన్నీ కుదిపేస్తూ కృత్రిమ మేధ (AI)విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. టెక్నాలజీ ప్రపంచంలో అది సరికొత్త సంచలనాలకు దారి తీస్తోంది. అయితే ఈ సాంకేతిక పురోగతితో ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు పెరుగుతున్న వేళ, గూగుల్‌ డీప్‌మైండ్‌ సీఈఓ డెమిస్‌ హస్సాబిస్‌(Demis Hassabis)కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై కంటే,దాన్ని దుర్వినియోగం చేయడమే అసలు ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కృత్రిమ మేధను చెడు ఉద్దేశాలతో వినియోగించడంపై హస్సాబిస్‌ గంభీరంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా మనుషుల ఉద్యోగాలు పోవడం తనకు అంతగా ఆందోళన కలిగించదని, కానీ అది తప్పుదారి పట్టిన వ్యక్తుల చేతిలో పడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

కృత్రిమ మేధను చెడు ఉద్దేశాలతో వినియోగించడంపై  హస్సాబిస్‌ ఆవేదన 

అలాంటి వ్యక్తులకు ఈ సాంకేతికతకు ప్రవేశాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అదే సమయంలో, ఈ శక్తివంతమైన టెక్నాలజీని సద్వినియోగం చేస్తే ఎన్నో అద్భుతమైన పనులను సులభంగా సాధించవచ్చని అన్నారు. కృత్రిమ మేధను చెడు ఉద్దేశాలతో వినియోగించడంపై హస్సాబిస్‌ గంభీరంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా మనుషుల ఉద్యోగాలు పోవడం తనకు అంతగా ఆందోళన కలిగించదని,కానీ అది తప్పుదారి పట్టిన వ్యక్తుల చేతిలో పడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులకు ఈ సాంకేతికతకు ప్రవేశాన్ని పరిమితం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అదే సమయంలో, ఈ శక్తివంతమైన టెక్నాలజీని సద్వినియోగం చేస్తే ఎన్నో అద్భుతమైన పనులను సులభంగా సాధించవచ్చని అన్నారు.

వివరాలు 

ఏఐ అభివృద్ధితో వైట్‌-కాలర్‌ ఉద్యోగాలు తగ్గే అవకాశం 

డెమిస్‌ హస్సాబిస్‌ అభిప్రాయ ప్రకారం, ఏఐ అభివృద్ధితో ప్రాథమిక స్థాయి వైట్‌-కాలర్‌ ఉద్యోగాలు తగ్గే అవకాశముంది. ఏఐ సాధారణ పనులను స్వయంచాలకంగా నిర్వహించగలగడం వల్ల, మనుషులు మరింత నైపుణ్యం అవసరమైన, సృజనాత్మకతను కోరే రంగాలవైపు దృష్టి సారించగలరని చెప్పారు. ఇది కొత్త ఉద్యోగావకాశాలను తెచ్చిపెడతుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు తగిన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళికంగా,రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా,ఏఐ వాడకాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అంతర్జాతీయంగా దేశాలు పరస్పర సహకారం అందించాల్సిన అవసరం ఉందని డెమిస్‌ హస్సాబిస్‌ స్పష్టం చేశారు.