
Digital Legacy Will: మనం చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల సంగతేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
''మాథ్యూ చనిపోయాడన్న సంగతి కొందరికి తెలీదు. వారు ఆయన పుట్టినరోజున ఫేస్ బుక్ పేజీలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ పోస్టులు చూసినప్పుడు మనసు బరువుగా మారుతుంది'' అని హేలీ స్మిత్ చెప్పింది.
హేలీ భర్త మాథ్యూ (33) క్యాన్సర్‌తో మరణించి రెండు సంవత్సరాలు గడిచాయి. కానీ ఆయన సోషల్ మీడియా ఖాతాలను ఏం చేయాలో ఆమెకు స్పష్టత లేదు.
''ఫేస్‌బుక్ అకౌంట్‌ను స్మారక పేజీగా మార్చాలని ప్రయత్నించాను. కానీ ఫేస్‌బుక్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడిగింది. దాదాపు 20 సార్లు అప్‌లోడ్ చేసినా పత్రాన్ని ఫేస్‌బుక్ తీసుకోలేదు. ఈ సమస్యకు పరిష్కారం వెతకడానికి అవసరమైన శక్తి నాలో లేదు'' అని హేలీ (యూకే నివాసితురాలు) చెప్పింది.
స్మారక ఖాతా
స్మారక ఖాతా అంటే ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్నారు.
కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆన్‌లైన్ ఉనికి పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ముఖ్యమైన అంశంగా మారింది.
బంధువులు లేదా సన్నిహితులు మరణ వార్తను సోషల్ మీడియా సంస్థలకు అధికారికంగా తెలియజేయకపోతే, ఆ వ్యక్తి ఖాతాలు యాక్టివ్‌గానే కొనసాగుతాయి.
ఒకసారి మరణ వార్త అధికారికంగా తెలిసిన తర్వాత, కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఖాతాను డీయాక్టివేట్ చేసే అవకాశం ఇస్తాయి. మరికొన్ని సంస్థలు స్మారక ఖాతా మార్గాన్ని సూచిస్తాయి.
ఉదాహరణకు మెటా (ఫేస్‌బుక్) సంస్థకు మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తే, ఖాతాను తొలగించేందుకు లేదా స్మారక ఖాతాగా మార్చేందుకు వీలుంటుంది.
వివరాలు
స్మారక ఖాతా అంటే ఏమిటి?
ఈ స్మారక ఖాతా ద్వారా మరణించిన వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలను, ఫోటోలను ఇతరులతో పంచుకోవచ్చు.
ఖాతాదారుడి పేరువద్ద "in memoriam" అనే సందేశం కనిపిస్తుంది. అయితే ఖాతాదారు మరణానికి ముందు "లెగసీ కాంటాక్ట్" అనే వారిని నియమించకపోతే, తర్వాత ఆ ఖాతాలోకి ఎవరూ లాగిన్ చేయలేరు, నిర్వహించలేరు.
లెగసీ కాంటాక్ట్ అనేది ఆ ఖాతాను నిర్వాహించేందుకు, డీయాక్టివేట్ చేయేందుకు నియమించిన వ్యక్తి.
ఫేస్‌బుక్‌లో ఈ రకమైన ఖాతాలను "People you may know" సెక్షన్‌లో చూపించరు.
మరణించిన వారి పుట్టినరోజుల నోటిఫికేషన్లు కూడా వారి ఫ్రెండ్స్‌కు రావు.
గూగుల్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్ వంటి సేవలు తమ ఖాతాదారులకు ఇనాక్టివ్ అకౌంట్ సెట్టింగ్‌ను అందిస్తాయి.
వివరాలు
స్మారక ఖాతా అంటే ఏమిటి?
యూజర్ ఒక నిర్దిష్ట కాలానికి ఇన్‌ఆక్టివ్‌గా ఉంటే, ఆ అకౌంట్‌లోని సమాచారం ఏమవ్వాలన్నది ముందుగానే నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తాయి.
ట్విటర్‌కి ఈ విషయంలో స్మారక ఖాతాల కోసం ఎటువంటి ఏర్పాట్లు లేవు.
యజమాని మరణించినా, ఖాతాలోకి ప్రవేశించలేకపోయినా, దాన్ని కేవలం డీయాక్టివేట్ చేయడమే వీలవుతుంది.
టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.
డిజిటల్ లెగసీ విల్
డిజిటల్ లెగసీ విల్ - అవసరమా?
సెర్బియాలో హైటెక్ క్రైమ్ విభాగానికి మాజీ అధిపతిగా పనిచేసిన సాషా జివానోవిక్ మాట్లాడుతూ - ''మరణించిన వారి ఖాతాల్లోని ఫోటోలు,వీడియోలు,డేటా ఆగంతుకుల చేతుల్లో పడితే మోసాలకు దారితీయవచ్చు. అదే పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించవచ్చు. వారి పేరుతో డబ్బులు కూడా అడగవచ్చు'' అని హెచ్చరించారు.
యూకే డిజిటల్ లెగసీ అసోసియేషన్ అధిపతి జేమ్స్ నోరిస్ మాట్లాడుతూ.. ''సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న కంటెంట్‌పై ముందే ఆలోచించడం,వాటిని బ్యాకప్ చేసుకోవడం చాలా అవసరం'' అన్నారు.
ఫేస్‌బుక్‌లోని ఫోటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేసి, అవసరమైతే బంధువులకు పంపించవచ్చని సూచించారు.
వివరాలు
డిజిటల్ లెగసీ విల్ - అవసరమా?
''ఒకవేళ నాకు ప్రాణాంతక వ్యాధి ఉంటే, నా పిల్లలు సోషల్ మీడియా వాడకపోతే, నా ప్రైవేట్ మెసేజ్‌లు వారు చదవకూడదు. కావలసిన వాటిని మాత్రమే భద్రపరచడం నాకు ఇష్టం. అందుకే డిజిటల్ లెగసీ గురించి ముందే ఆలోచించాలి'' అన్నారు.
అంతేకాకుండా, డిజిటల్ లెగసీకి సంరక్షకులు మీరే. సోషల్ మీడియా సంస్థలు కాదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా
సోషల్ మీడియాతోనే డిజిటల్ లెగసీ పరిమితమా?
డిజిటల్ లెగసీ అనేది ఎంతో విస్తృతమైన అంశమని, యూకేలోని మేరీ క్యూరీ అనే చారిటీలో పనిచేస్తున్న రీసెర్చ్ నర్స్ సారా అటాన్లీ అన్నారు.
చనిపోయిన తర్వాత కేవలం సోషల్ మీడియా ఖాతాలే కాకుండా, ఇతర డిజిటల్ ఆస్తుల గురించి కూడా ఆలోచించాలి.
బ్యాంకింగ్, మ్యూజిక్ అకౌంట్లు, గేమింగ్ ఖాతాలు, ఆన్‌లైన్ అవతారాలు.. ఇవన్నీ కూడా ఇందులో భాగమవుతాయి. ''మీరు మరణించిన తర్వాత మీ డిజిటల్ ఫోటోలు పిల్లలకు అందాలా? వాటిని ముద్రించి ఆల్బమ్ రూపంలో ఇవ్వాలా? లేక ఖాతాలను పూర్తిగా తొలగించాలా? అనే విషయాల్లో ముందుగానే స్పష్టత ఉండాలి'' అన్నారు.
వివరాలు
హేలీ, మాథ్యూ ఉదంతం - బాహ్యంగా కనిపించని బాధ
హేలీ,మాథ్యూలకు ఇది చర్చించడానికి తేలికైన విషయం కాదు.''చనిపోయే సమయానికి మాథ్యూతో ఈ అంశంపై మాట్లాడలేకపోయాను.ఆయన ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే ఆశించాం.చావు గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు'' అన్నారు హేలీ.
వారికి పెళ్లయిన ఏడాదిలోనే మాథ్యూకు స్టేజ్ 4 గ్లియోబ్లాస్టోమా నిర్ధారణ అయింది.ఆయన వయస్సు అప్పటికి 28 సంవత్సరాలు. 2016 జూలైలో వ్యాధి గుర్తించబడింది.శస్త్రచికిత్స,కీమోథెరపీ తర్వాత కణితి మళ్లీ తిరిగొచ్చింది.వైద్యులు ఆయనకు ఇంకా ఏడాది మాత్రమే జీవితం మిగిలిందని చెప్పారు. హేలీ ఫేస్‌బుక్ ఖాతాను స్మారకంగా మార్చాలన్నా,అది ఒక సంక్లిష్ట ప్రక్రియగా మారిందని చెప్పారు. ''మరణ ధ్రువీకరణ పత్రాన్ని చూస్తే బాధ కలుగుతుంది. అందుకే ఆ ప్రక్రియను వాయిదా వేసేస్తున్నా. సంస్థలు ఈ ప్రక్రియను బాధిత కుటుంబాలకు సులభతరం చేయాలి'' అని ఆమె కోరారు.