Page Loader
Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా 'ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్' ఫీచర్ విడుదల 
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా 'ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్' ఫీచర్ విడుదల

Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త.. కొత్తగా 'ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్' ఫీచర్ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా, తన ప్రాచుర్యం పొందిన ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా "ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్" అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ స్నేహితుడు లేదా గ్రూప్ చాట్‌తో ప్రత్యేకమైన రీల్స్ ఫీడ్‌ను పంచుకోవచ్చు. అయితే, ఈ బ్లెండ్ ఫీచర్‌కి యాక్సెస్ పొందేందుకు ఓ ప్రత్యేక ఆహ్వానం (ఇన్వైట్) అవసరం. ఈ బ్లెండ్ ఫీచర్ వినియోగదారులకు నిత్యం తాజా, పర్సనలైజ్డ్ వీడియోల ఎంపికను అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడీ కొత్త ఫీచర్‌ను శ్రేణులవారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని సహాయంతో యూజర్లు తమ స్నేహితులతో ప్రైవేట్‌గా, వారి అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసిన రీల్స్‌ను పంచుకోవచ్చు.

వివరాలు 

బ్లెండ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? 

ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, బ్లెండ్ పూర్తిగా ప్రైవేట్ ఫీచర్. ఇది డైరెక్ట్ మెసేజ్‌లా పనిచేస్తుంది. మీరు మీ స్నేహితుడిని బ్లెండ్‌కి ఆహ్వానించవచ్చు. ఆయన ఆ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం మీ ఇద్దరి కోసం ప్రత్యేకమైన రీల్స్ సిఫార్సు చేస్తుంది. ఈ రీల్స్ పూర్తిగా మీ వ్యక్తిగత ఉపయోగానికి తగినవిగా ఉంటాయి. మీ స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే కంటెంట్ ఆధారంగా ఫీడ్ సిద్ధమవుతుంది.

వివరాలు 

ఇన్వైట్ ద్వారా మాత్రమే యాక్సెస్ 

బ్లెండ్‌కి సబ్‌స్క్రైబ్ కావాలంటే మీకు స్నేహితుడి నుంచి ఇన్విటేషన్ రావాలి లేదా మీరు పంపిన ఇన్విటేషన్‌ను ఆయన అంగీకరించాలి. ఒకసారి ఇద్దరు యూజర్లు బ్లెండ్‌లో చేరితే, వారు DMలో షేర్ చేసిన రీల్స్ తాలూకు ఫీడ్‌లో స్వయంగా అప్‌డేట్ అవుతాయి. చాట్‌తో పాటు ఎమోజీ రెస్పాన్స్ కూడా బ్లెండ్‌లో వచ్చే ప్రతి రీల్‌కి, అది ఎవరికి చెందిందో వారి పేరు కూడా చూపించబడుతుంది. రీల్స్ చూసేటప్పుడు వినియోగదారులు స్క్రీన్ దిగువన ఉన్న మెసేజ్ బార్ ద్వారా ప్రత్యక్షంగా చాట్ చేయవచ్చు లేదా ఎమోజీల రూపంలో స్పందన ఇవ్వవచ్చు.

వివరాలు 

బ్లెండ్ ఐకాన్ ఎలా కనిపిస్తుంది? 

ఈ ఫీచర్ యాక్టివ్ చేసిన తర్వాత, మీ చాట్ విండోలో ఆడియో మరియు వీడియో కాల్ బటన్ల పక్కన ప్రత్యేక బ్లెండ్ ఐకాన్ కనిపిస్తుంది. మీరు కోరినప్పుడు ఈ బ్లెండ్ ఫీచర్ నుంచి బయటపడే అవకాశమూ ఉంది. ఐప్యాడ్ కోసం ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ యాప్ తాజా నివేదికల ప్రకారం మెటా సంస్థ ఐప్యాడ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఐప్యాడ్‌లలో ఐఫోన్ వర్షన్ యాప్ ఉపయోగించబడుతోంది.అయితే పెద్ద స్క్రీన్‌పై అనుభవం ఆశించినంత సజావుగా ఉండడం లేదు.అందువల్ల ప్రత్యేకంగా ట్యాబ్లెట్ల కోసం డెవలప్ చేస్తున్న యాప్‌పై టెస్టింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ కొత్త ఐప్యాడ్ యాప్ ఎప్పుడు అధికారికంగా విడుదల అవుతుందన్న విషయంపై ఇంకా ఎటువంటి ప్రకటన లేదు.