
PRALAY missile: ఒడిశా తీరంలో విజయవంతంగా ' ప్రళయ్' క్షిపణులపరీక్షలు..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన 'ప్రళయ్' అనే క్షిపణిని వరుసగా పరీక్షించారు ఈ పరీక్షలు జూలై 28, 29 తేదీల్లో ఒడిశాలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలోని ప్రయోగ కేంద్రంలో నిర్వహించగా, విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పరీక్షల ద్వారా ప్రళయ్ క్షిపణి తక్కువ,ఎక్కువ శ్రేణులలో దాని సామర్థ్యాన్ని పరిశీలించడానికి యూజర్ ఎవల్యూషన్ ట్రయల్స్ నిర్వహించారు. డీఆర్‌డీవో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు పరీక్షల సమయంలో కూడా క్షిపణి అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరింది. అంతేకాకుండా, అన్ని సాంకేతిక ప్రమాణాలను ఈ క్షిపణి విజయవంతంగా అందుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ క్షిపణి సేవలో వినియోగించడానికి సిద్ధంగా ఉన్నదని స్పష్టమైంది.
వివరాలు
150 కిలోమీటర్లు నుంచి గరిష్ఠంగా 500 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు
ప్రళయ్ ఒక స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా తయారైంది.దీనిని నేరుగా యుద్ధ పరిస్థితులలో వినియోగించడానికి రూపొందించారు. భారత సాయుధ దళాల్లో వాయుసేన, భూసేన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని అభివృద్ధి చేశారు. ఇది కనీసం 150 కిలోమీటర్లు నుంచి గరిష్ఠంగా 500 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలదు. అలాగే ఇది సుమారు 350 కిలోల నుంచి 700 కిలోల బరువున్న వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, రవాణా కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌లను ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రళయ్ క్షిపణిని వాహనాలపై ఎక్కించి అనుసంధానించిన తర్వాత, అవసరమైన ప్రదేశానికి తరలించి మోహరించవచ్చు. ఇది మొబిలిటీతో పాటు సమర్థవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాన్ని కలిగి ఉంది.