
China: ల్యాండింగ్ ప్రయత్నంలో చైనా డీప్ బ్లూ రాకెట్ పేలుడు.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రీయూజబుల్ రాకెట్ కోసం చేపట్టిన ప్రయోగం విఫలమైంది.
ఈ సంస్థ అభివృద్ధి చేసిన నెబులా-1 రాకెట్‌కు వర్టికల్ టేకాఫ్,వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించగా,మొత్తం 11 లక్ష్యాల్లో 10 విజయవంతమయ్యాయి.
అయితే, ల్యాండింగ్ సమయంలో ఒక లక్ష్యం విఫలమైంది. మొదట విజయవంతంగా గాల్లోకి వెళ్ళిన రాకెట్ ల్యాండింగ్ దశలో నియంత్రణ కోల్పోయి, నేలకి దిగడానికి కొన్ని క్షణాల ముందు పేలిపోయింది.
ఈ ప్రయోగంలో ఎక్కువ భాగం విజయవంతమైనట్లు డీప్ బ్లూ ప్రకటించింది.ప్రయోగానికి సంబంధించిన డ్రోన్ వీడియోలను కూడా విడుదల చేసింది.
ప్రయోగం సమయంలో సేకరించిన డేటాను ప్రస్తుతం విశ్లేషిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.అంతరిక్ష రంగంలో చైనాలో అగ్రగామిగా నిలిచే ప్రయత్నంలో ఈ సంస్థ ఎంతో కృషి చేస్తోంది.
వివరాలు
పేచీలోడ్ తక్కువైతే ప్రయాణదూరం పెరగడం దీని ప్రత్యేకత
ఇంధనంగా కిరోసిన్‌ను ఉపయోగించిన ఈ రాకెట్‌లో, మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్ వినియోగంపైనా ప్రయోగాలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
రాకెట్ తయారీ ఖర్చును గణనీయంగా తగ్గించేందుకు ఈ ద్రవ్యాలు ఉపయోగపడతాయని వివరించింది.
నెబులా-1లో 3డీ ప్రింటెడ్ థండర్-ఆర్1 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 2,000 కిలోగ్రాముల పేచీలోడ్‌ను దిగువ కక్ష్యలోకి చేర్చగలదు.
పేచీలోడ్ తక్కువైతే ప్రయాణదూరం పెరగడం దీని ప్రత్యేకత. ఈ రాకెట్ ద్వారా మొత్తం 8 టన్నుల పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఈ సంస్థ 2022 మేలో కిలోమీటర్ స్థాయి వీటీవీఎల్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.దీనివల్ల చైనాలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది. 2023 ఆగస్టు 13న ఈ సంస్థలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రయోగానికి సంబంధించిన డ్రోన్ వీడియో
This is easily the most incredible footage of a rocket landing I have ever seen. Video is by Deep Blue Aerospace pic.twitter.com/PxmU7ugBIS
— SpaceBasedFox 𝖕𝖊𝖗𝖎𝖌𝖊𝖊𝖆𝖊𝖗𝖔.𝖈𝖔𝖒 (@SpaceBasedFox) September 22, 2024