Earth on alert: 3I/Atlas ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్ట్ పై కొత్త అధ్యయనం… భూమికి ప్రమాదాలున్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
రాత్రి ఆకాశం ఎంత ప్రశాంతంగా కనిపించినా, మన సౌరవ్యవస్థ గుండా గుర్తుపట్టలేని ఖగోళ అతిథులు అప్పుడప్పుడూ దాటిపోతుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్టులు.. అంటే నక్షత్రాల మధ్య తిరిగే రహస్య ఖగోళ శరీరాలు. తాజాగా వచ్చిన ఒక శాస్త్రీయ అధ్యయనం ఇవి భూమికి ఎలాంటి ప్రమాదాలు కలిగించగలవో పరిశీలిస్తోంది.
వివరాలు
ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్టులు ఎక్కడి నుండి వస్తాయి?
గత కొన్ని ఏళ్లలో మూడు ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్టులు మనకు కనిపించాయి. 2017లో వచ్చిన 'Oumuamua', 2019లో కనిపించిన 2I/Borisov కొమెట్,ఇప్పుడు వచ్చిన 3I/Atlas. ఇవి కాకుండా మరెన్నో గతంలో వచ్చి ఉండి, మనం గమనించకపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొన్న భారీ క్రేటర్లు.. వ్రెడెఫోర్ట్ లాంటి వాటి.. గురించిన అనుమానాలను మరింత పెంచుతున్నాయి. పురాతన భూమి చాలా హింసాత్మకమైన ప్రమాదాలను చూసింది. ఇప్పుడు చుట్టుపక్కల పెద్ద రాళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇంటర్‌స్టెల్లార్ వస్తువులు ఏ మాత్రం తగ్గకుండా,నిరంతరం భూమి దగ్గరకి రావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి భూమిని తాకే అవకాశాలు ఎంత?అన్నదానిపై మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలోని డారిల్ సెలిగ్మన్ బృందం arxiv.orgలో కొత్త అధ్యయనం చేసింది.
వివరాలు
10 వేల వరకు భూమిని ఢీకొనే అవకాశం
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గాలక్సీ అంతటా ఎక్కువగా ఉండే ఎం-టైప్ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాల చలనాలను ఆధారంగా తీసుకున్నారు. సుమారు 10 బిలియన్ ఆబ్జెక్టులను నమూనాలుగా సృష్టించి, వాటిలో దాదాపు 10 వేల వరకు భూమిని ఢీకొనే అవకాశమున్నవని గుర్తించారు. ఫలితాల్లో రెండు ప్రధాన దిశలు కనిపించాయి. ఒకటి సోలార్ ఏపెక్స్, అంటే మన సౌరవ్యవస్థ గాలక్సీలో కదులుతున్న దిశ. అక్కడి నుంచి వచ్చే వస్తువులు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. రెండవది గాలాక్టిక్ ప్లేన్, అంటే గాలక్సీ మధ్య భాగంలో నక్షత్రాలు ఎక్కువగా ఉండే పరపు ప్రాంతం. అక్కడి నుండి కూడా ఇటువంటి శరీరాలు రావచ్చు.
వివరాలు
ఋతువుల ప్రకారం ప్రమాదం మారుతుందా?
చాలా ఇంటర్‌స్టెల్లార్ వస్తువులు అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి. అయితే నెమ్మదిగా వచ్చే వస్తువులు భూమిని చేరే అవకాశం ఎక్కువ. ఎందుకంటే సూర్యుడి గురుత్వాకర్షణ వాటి దారిని సులభంగా మలుస్తుంది. సహజంగానే ఇవి తక్కువ ఎక్స్‌సెంట్రిసిటీ ఉండే హైపర్‌బాలిక్ మార్గాల్లో వస్తాయి. ఈ మార్గాలు సూర్యుడి దగ్గర స్వల్పంగా "క్యాప్చర్" అయ్యేలా చేస్తాయి. వసంతకాలంలో భూమి సోలార్ ఏపెక్స్ వైపు తిరగడం కారణంగా వేగంగా వచ్చే ప్రమాదకర ఆబ్జెక్టులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది. శీతాకాలంలో మాత్రం సోలార్ యాంటీఏపెక్స్ వైపు తిరుగుతుంది గనుక వస్తువులు కొద్దిగా ఎక్కువగా గమనించే అవకాశముంటుంది.
వివరాలు
ఎం-స్టార్ చలనాల ఆధారంగా ఫలితాలు
అక్షరేఖకు దగ్గర ప్రాంతాల్లో ఢీకొనే అవకాశాలు స్వల్పంగా ఎక్కువ. ఉత్తరార్ధగోళంలో కూడా కొంచెం అధిక ప్రమాదం ఉందని పరిశోధకుల పరిశీలన. ఇదే ప్రాంతంలో ఎక్కువ మంది మనుషులు నివసిస్తున్నారని కూడా వారు గుర్తించారు. అయితే ఈ ఫలితాలు ఎం-స్టార్ చలనాల ఆధారంగా వచ్చినవి. ఇతర నక్షత్రాల కదలికలు ఉంటే నమూనాలు మారొచ్చు. అయినప్పటికీ మొత్తం ధోరణి చాలా దగ్గరగానే ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వివరాలు
డీప్ స్కానింగ్ ద్వారా ఈ అంచనాలు నిజమా కాదా అన్నది స్పష్టం
త్వరలో ప్రారంభమయ్యే వెరా రూబిన్ అబ్జర్వేటరీ జరిపే Legacy Survey of Space and Time ఈ మోడల్‌ను పరీక్షించనుంది. దాని డీప్ స్కానింగ్ ద్వారా ఈ అంచనాలు నిజమా కాదా అన్నది స్పష్టమవుతుంది. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు మొత్తం ఎంత ఇంటర్‌స్టెల్లార్ ఆబ్జెక్టులు ఉన్నాయో చెప్పలేకపోతున్నారు. ఇంకా మరింత పరిశీలనలు పెరగాలి. ఈ అధ్యయనం మాత్రం భవిష్యత్తులో ఇలాంటి వస్తువులను గుర్తించడానికి ఒక మార్గదర్శకం అందించింది.