ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్ ట్విటర్ ప్రస్తుత విలువను $20 బిలియన్లుగా ప్రకటించారు, ఇది ఐదు నెలల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కోసం అతను చెల్లించిన $44 బిలియన్లలో సగం కంటే తక్కువ. Snap ($18.2 బిలియన్), Snapchat పేరెంట్ సంస్థ వెబ్‌సైట్ Pinterest ($18.7 బిలియన్) కంటే కొంచెం ఎక్కువ. ట్విట్టర్ కమ్యూనికేషన్స్ విభాగాన్ని AFP ప్రశ్నిస్తూ చేసిన ఈమెయిల్ కు ఒక పూప్ ఎమోజి రూపంలో ఆటోమేటిక్ స్పందన వచ్చింది.
ట్విట్టర్ విలువను 20 బిలియన్ డాలర్లగా చేసిన మస్క్
7,500 నుండి 2,000 కంటే తక్కువకు ఉద్యోగులను తగ్గించిన మస్క్
మస్క్ ఈ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసిన తర్వాత చాలామంది ప్రకటనదారులు ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు మెల్లగా తిరిగి రావడం ప్రారంభిస్తున్నారు, ఆ ఫలితాలు సంవత్సరం రెండవ త్రైమాసికంలో కనిపించచ్చు అని మస్క్ తెలిపారు. అధీనంలోకి తీసుకున్నప్పటి నుండి, మస్క్ ఉద్యోగులను 7,500 నుండి 2,000 కంటే తక్కువకు తగ్గించారు. $250 బిలియన్ల విలువకు ట్విట్టర్ ను తీసుకురావడానికి చూస్తున్నానని, అతను పేర్కొన్నారు. టెస్లా ఇంక్, ఏరోస్పేస్ గ్రూప్ స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా అయిన మస్క్, ఈ సోషల్ నెట్‌వర్క్‌లోని ఉద్యోగులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి షేర్లను క్యాష్ చేసుకోవడానికి ట్విట్టర్ వీలు కల్పిస్తుందని చెప్పారు.